చేతిలో పెద్ద సినిమా.. అయినా హీరోల వెంట పడుతున్న డైరెక్టర్.. ఎవరి దగ్గరకు వెళ్ళినా అదేమాట!
ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని బాషలలో హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కేవలం మార్కెట్ లేక, క్రేజ్ తక్కువ ఉన్న హీరోలు మాత్రమే కొంచెం కాళీగా ఉన్నారు. మిగతా వారంతా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఒక సినిమా చేయడానికి టాలీవుడ్ డైరెక్టర్ అనేక తంటాలు పడుతున్నారని తెలుస్తోంది. ఎవరా దర్శకుడు? ఏమా కథ ? అనే వివరాల్లోకి వెళితే

పెద్ద సినిమాను లైన్ లో
టాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తాడని పేరున్న ఒక దర్శకుడు తన తదుపరి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి అష్టకష్టాలు పడుతున్నారని తెలుస్తోంది. ఆయన దర్శకుడిగా చేసిన చివరి సినిమా మూడేళ్ల క్రితం విడుదలైంది. అలా అని ఆయన ఖాళీగా ఏమీ లేరు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఒక పెద్ద సినిమాను లైన్ లో పెట్టారు.

మహేష్ బాబుతో
అలా ఆ దర్శకుడి చేతిలో పెద్ద సినిమా ఉంది కానీ ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారనే దానిపై క్లారిటీ లేదు. ఇక ఆ సినిమా కోసం చూస్తూ కూర్చోకుండా ఎలా అయినా మరో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించిన సదరు దర్శకుడు మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అందుకే ఆయనతో భేటీ కూడా అయ్యారట.

గాప్ ఉండాల్సిందే అని
సదరు దర్శకుడు మహేష్ బాబుని సంప్రదించి త్రివిక్రమ్ సినిమా కోసం సమయం పడుతుంది కదా, నేను కేవలం ఐదు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేస్తా, నాతో సినిమా చేయడానికి ఒక ఐదు నెలల సమయం కావాలని అడిగాడట. అయితే త్రివిక్రమ్ సినిమా కంటే ముందు తాను ఏ సినిమా చేయబోనని తనకు సినిమాకు- సినిమాకు మధ్య ఖచ్చితంగా గాప్ ఉండాల్సిందే అని తేల్చి చెప్పాడట.

ఎవరూ ఖాళీగా లేరని
మహేష్ బాబు ఆ క్లారిటీ ఇచ్చేసినా వెనక్కు తగ్గని సదరు దర్శకుడు ఒక సూపర్ హిట్ మలయాళ రీమేక్ తో మరో టాప్ హీరోని సంప్రదించాడని అంటున్నారు. ఆ సబ్జెక్ట్ విన్న తర్వాత భలే ఉందే ఈ సినిమా చేసేద్దాం అని మొదట్లో హీరో ఓకే చెప్పినా నాలుగు రోజుల తర్వాత అతనికి ఫోన్ చేసి సబ్జెక్ట్ సూట్ కాదని చెప్పుకొచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ సబీజెక్ట్ ఇంకా ఎవరికైనా చెప్పాలా? అని ఆలోచిస్తూ ఉండగా ప్రస్తుతం పెద్ద హీరోలు ఎవరూ ఖాళీగా లేరని తెలియడంతో దాన్ని పక్కన పెట్టారు.

ఆ హీరో కంటే
దీంతో ఇప్పుడు దర్శకుడు రామ్‌ని టార్గెట్ చేశాడని, ఇప్పటికే ఆయనను కలిసి ఒక కధ కూడా చెప్పారని అంటున్నారు. అయితే ఆ ఫలితం ఇంకా తెలియాల్సి ఉంది. దర్శకుడి చూపు తమిళ హీరో పైన కూడా ఉందని అంటున్నారు. ఇలా అనేక విశ్వ ప్రయత్నాల తరువాత సదరు దర్శకుడు తన మొదటి సినిమా హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో పడి ఆయన వద్దకు కూడా వెళ్ళాడు.
అయితే ఇలా దర్శకుడు వరుసగా హీరోల వెంట పడుతున్న విషయాన్ని గురించి తెలిసి ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నాడట. మరి దర్శకుడి తదుపరి సినిమా ఎప్పుడు మొదలు కానున్నది అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











