గోపీచంద్ కు వెంకటేష్ ఓ రేంజిలో టార్చర్
వెంకటేష్ తో బాడీగార్డు రీమేక్ చేస్తున్న మలినేని గోపిచంద్ కి టార్చర్ అంటే ఏమిటో అర్దమవుతోంది.హిందీ బాడీగార్డు విడుదల అయిన దగ్గరనుంచి అతనిపై ఒత్తిడి బాగా పెరిగిపోయిందిట.మాటిమాటికి వెంకటేష్ ప్రతీ విషయంలోనూ తలదూర్చి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. అందులోనూ వరస ప్లాపుల్లో ఉన్న వెంకటేష్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. దాంతో ఆ హోప్స్ టెిన్షన్ గా మారి గోపిచంద్ ని జుట్టు పీక్కునేలా చేస్తోంది.రోజు రోజుకీ ప్రతీ సీన్ కి స్క్రిప్టులో మార్పులు అడగటం, ప్రతీ సారి ఛేంజెస్ రావటం గోపీచంద్ కి మింగుడుపడటం లేదని వినికిడి.
ఇక సల్మాన్ ఖాన్ సినిమాను చూసి వచ్చిన వెంకి అందులో హైలెట్ అయిన వాటిని ఎడాప్ట్ చేయమని కోరుతున్నాడుట.అంతేగాక ఆల్రెడీ తీసేసిన సీన్స్ ను మళ్ళీ రీషూట్ చేద్దామని పట్టుపడుతున్నాడట. హీరోనే అత్యుత్సాహం ల్లచూపిస్తూండటంతో నిర్మాత బెల్లంకొండ కూడా ఏమీ అనలేని పరిస్దితి నెలకొని ఉంది. ఇదే సినిమా తమిళ రీమేక్ లో విజయ్, అసిన్ జత కట్టారు.అయితే తమిళ సినిమా ఆడలేదు. హిందీ వెర్షన్ లో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ చేసారు. గతంలో వెంకీ, త్రిష కలిసి 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే', 'నమో వేంకటేశ' సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











