»   » వెయ్యి మందితో యాక్షన్ సీన్ - జూ ఎన్టీఆర్ సింగిల్ టేక్

వెయ్యి మందితో యాక్షన్ సీన్ - జూ ఎన్టీఆర్ సింగిల్ టేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జూ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఈ చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ సీన్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. దాదాపు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఈ సీన్ జూ ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసాడట.

ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్లో వెల్లడిస్తూ...'1000 మంది జూనియర్ ఆర్టిస్టులు...హెవీ యాక్షన్ ఎపిసోడ్...అన్నీ రిస్కీ షాట్లే అయినా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసారు. అద్భుతమైన హీరో' అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు. 'క్లైమాక్స్ సీన్ లాస్డ్ డే...మరో మూడు పాటల చిత్రీకరణ, ఒక రోజు టాకీ పార్టుతో రామయ్యా వస్తావయ్యా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. షూటింగ్ పాస్ట్‌గా కంప్లీట్ అయింది. ఎంతో ఆశ్చర్యం వేసింది' అని హరీష్ చెప్పుకొచ్చారు.

<blockquote class="twitter-tweet blockquote"><p>Last Day of Climax, left with 3 Songs and 1 day talkie...Done with RV shoot Fastest shoot in recent times...even am surprised lyk how we did</p>— Harish Shankar .S (@harish2you) <a href="https://twitter.com/harish2you/statuses/370120737207902208">August 21, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
<blockquote class="twitter-tweet blockquote"><p>1000 Jr artists...heavy action episode ...all are risky shots still Young Tiger is doing in Single take..awesomeeeeeeeee Hero ;</p>— Harish Shankar .S (@harish2you) <a href="https://twitter.com/harish2you/statuses/370119975857823744">August 21, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ఈచిత్రం షూటింగ్ ఆగస్టు 26 నుండి స్పెయిన్లో జరిపేందుకు రంగం సిద్దమైంది. తమన్ ఆడియో కంపోజింగ్ పూర్తి చేయడంతో అందులోని రెండు సాంగులను స్పెయిన్ దేశంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ రెండు సాంగులు ప్రేక్షకులకు నయనానందకరంగా అద్భుతమైన డాన్స్ స్పెప్పులతో పాటు, రొమాంటిక్‌గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్టు మూడో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

బాద్‌షా తర్వాత ఎన్టీఆర్‌, గబ్బర్‌సింగ్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

English summary
“1000 Jr artists…heavy action episode …all are risky shots still Young Tiger(NTR) is doing in Single take..awesomeeeeeeeee Hero”, Director Harish Shankar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu