పొట్టోడంటూ...త్రాగి హీరోని తిట్టిన తెలుగు డైరక్టర్

By Srikanya

తెలుగులో ఓ స్టార్ డైరక్టర్ రీసెంట్ గా ఓ బర్త్ డే ఫంక్షన్ కి హాజయ్యారు.అక్కడకి వచ్చిన మరో హీరోని ఉద్దేశించి..అతని ఎత్తుపై కామెంట్ చేయటంతో పెద్ద అల్లరి అయ్యింది. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్కీగా మారింది. ఆ హీరో సినిమా కూడా ఈ మధ్యనే విడుదలై ఫరవాలేదనిపించుకుంది. మొదట సరదాగా మైదలైన మాటలు తర్వాత వివాదంగా మారింది. అక్కడ ఉన్న మరికొంత మంది దర్శకులు ఆపటానికి ప్రయత్నించినా ఆగలేదు. పొట్టోడా..నువ్వు కూడా హీరోవేనా ..అని బూతులు లంకించుకున్నాడు. అప్పటివరకూ గౌరవంగా మాట్లాడిన ఆ హీరో కూడా ఇన్సల్ట్ ఫీలై ఆ డైరక్టర్ ని అందరి క్రెడిట్ లు వేసుకుంటూ తిరిగేవాడివి నీకు ఎంత స్టార్ డమ్ వస్తే ఏంటి..బయిటకు వెళ్లి చూడు నువ్వు మిగతా వాళ్ల క్రియేటివిటీని ఎలా దోచుకుంటున్నావో చెప్పుకుంటున్నారు అంటూ రివర్స్ అయ్యారు.

మధ్యలో ఒకరిద్దరు కలిగించుకోబోయినా ఆ దర్శకుడు ఆగలేదు. ఆ దర్శకుడు స్టార్ కావటంతో మిగతా వారు కూడా అతన్ని ఎదిరించటానికి ధైర్యం చేయలేకపోయారు. ఆ దర్శకుడు కి ఊహించని విధంగా స్టార్ డమ్ రావటం అతనికి కన్ను మిన్నూ కానని స్ధితికి వెళ్లిందని దాంతో కొందరు ప్రక్కకు వెళ్లి కామెంట్ చేసుకోవటం జరిగింది. విచిత్రమేమిటంటే ఆ దర్శకుడుతో ఆ హీరో ఒక్క సినిమానూ చేయలేదు.చివరకు ఆ దర్శకుడే గొడవ వదిలి బయిటకు వెళ్లారు. అయితే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఓ పాపులర్ తెలుగు న్యూస్ ఛానెల్ వెలుగులోకి తెచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X