RRR సీక్వెల్ పై రాజమౌళి తండ్రి న్యూ ఐడియా.. ఇది అయ్యే పనేనా?
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో సీక్వెల్స్ కు కూడా భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోంది. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ కొనసాగింపుగా మరో సినిమాను తీసుకొస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయి ఆకాశాన్ని దాటించేస్తున్నాయి. ఇక RRR లాంటి ఓ మల్టీస్టారర్ సినిమాకు కూడా సీక్వెల్ రాబోతున్నట్లుగా గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక ఐడియాతో రాజమౌళి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఈజీగా 1000కోట్లు
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఈజీగా సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

కల్పిత కథతో..
RRR సినిమా ఒక కల్పిత కథని రాజమౌళి సినిమా స్టార్ట్ చేసే ముందే క్లారిటీ ఇచ్చేశాడు. నిజ జీవితంలోని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను ఆధారంగా చేసుకొని ఒక కథను రూపొందించినట్లు చెప్పేశారు. కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధులు ఇద్దరూ కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

పవర్ఫుల్ సీక్వెల్ పాయింట్
అయితే ఇలాంటి కథకు సీక్వెల్ తీస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చాలామందిలో ఒక ఆలోచన అయితే ఉంది. రాజమౌళి కూడా గతంలో ఆ విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇప్పటివరకు అయితే సీక్వెల్ కథ పై ఎలాంటి ఆలోచన చేయలేదు అని వివరణ ఇచ్చారు. అయితే ఆయన తండ్రి రచయితకి విజయేంద్రప్రసాద్ మాత్రం RRR కు కూడా ఒక పవర్ఫుల్ సీక్వెల్ పాయింట్ ను ఆలోచించినట్లుగా తెలుస్తోంది.

వెబ్ సీరీస్ గా..
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ RRR కథను అందించిన చాలా కాలం తర్వాత ఆ కథకు సీక్వెల్ కూడా సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం ఏదో ఒక కథ గురించి రాజమౌళితో ఆయన చర్చిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ఈ సినిమా సీక్వెల్ పై కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ కథ వెబ్ సిరీస్ కోసం మాత్రమే ఉంటుందని కథనాలు కూడా వెలువడుతున్నాయి.
Recommended Video

ఇదివరకే బాహుబలి క్యాన్సిల్..?
అయితే ఇదివరకే రాజమౌళి బాహుబలి సినిమా కథకు కొనసాగింపుగా వెబ్ సిరీస్ ను రూపొందించాలని అనుకున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ అందుకోసం భారీగానే ఖర్చు కూడా చేసింది. రెండుసార్లు షూట్ చేసినా ఆ ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా రాలేదని క్యాన్సిల్ కూడా చేసేశారు. ఇక ఇప్పుడు కూడా విజయేంద్రప్రసాద్ పవర్ఫుల్ పాయింట్ తో RRR కథకు సీక్వెల్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ ప్రణాళికలు ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే అఫీషియల్గా క్లారిటీ ఇచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











