ఆ డైరెక్టర్ కి టచ్ లోకి ప్రభాస్.. కధ కూడా చెప్పడంతో ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్?

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆయన పూర్తిగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశారు. బాహుబలి తర్వాత సొంత ప్రొడక్షన్ అయిన యు.వి ప్రొడక్షన్ సంస్థతో సాహో అనే సినిమా చేసి రిలీజ్ చేశారు.. ఇక ప్రస్తుతం అదే సంస్థతో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాక ఇప్పటికే ఆయన నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చాలా మంది నిర్మాతలు దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒక దర్శకుడికి టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ప్యాన్ ఇండియన్ స్టార్

ప్యాన్ ఇండియన్ స్టార్

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. సాహో అనే సినిమా ఊహించినంత ఆదరణ దక్కించుకోలేక పోవడంతో ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకి కూడా మార్పులు చేర్పులు సూచించారు. మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ లేట్ అవుతోంది. ప్రభాస్ హెయిర్ స్టైలిస్టుకి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ నిలిపివేశారు.

వరుస సినిమాలు

వరుస సినిమాలు

ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టాడన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంఖ్య పెద్దగానే ఉంది

సంఖ్య పెద్దగానే ఉంది

ఈ సినిమా కాకుండా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత మేర తెలంగాణలో రామగుండం జిల్లాలో జరిగింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇవి కాకుండా ఆయన నాగ్ అశ్విన్ తో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అలాగే సిద్ధార్థ ఆనంద్ తో మరో సినిమా కూడా చేస్తున్నారు.. అన్ని సినిమాలు లైన్ లో ఉండగా ఇంకా ప్రభాస్ కోసం ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూసే దర్శకులు నిర్మాతలు సంఖ్య పెద్దగా ఉంది.

ఆ డైరెక్టర్ కి టచ్ లోకి

ఆ డైరెక్టర్ కి టచ్ లోకి

అయితే ఎంత మంది ప్రభాస్ కోసం ఎదురు చూస్తూన్నా ప్రభాస్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. తాజా సమచారం మేరకు డార్లింగ్‌ సినిమా చేసిన దర్శకుడు ఎ కరుణకరన్, స్క్రిప్ట్‌తో ప్రభాస్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అయితే ఈ ప్రాజెక్ట్ పై పాన్-ఇండియా స్టార్ ఏమి నిర్ణయించుకున్నారు అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలని అంటున్నారు. అయితే కరుణాకరన్ కి సరైన హిట్ లేకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ లో మునిగిపోయారు.

అదే నిజమైతే

అదే నిజమైతే

ప్రభాస్ ఇప్పుడున్న లైనప్ పూర్తి చేశాక ఒక మంచి ఫ్యామిలీ స్క్రిప్ట్ కోసం చూస్తున్నారని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే కరుణాకరన్ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చని అంటున్నారు. ప్రభాస్ మరియు కాజల్ అగర్వాల్ -స్టారర్ డార్లింగ్ సినిమా ప్రభాస్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటి. ఈ సినిమా విడుదలై ఒక దశాబ్దం పూర్తయినా ఈ సినిమా డైలాగ్స్ ఇప్పటికీ జనం నోళ్ళలో నానుతూనే ఉంటాయి. మరి ఆ మేజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X