సుకుమార్ బాటలో కొరటాల శివ.. నమ్మిన వాళ్ల కోసం స్పెషల్ ప్లాన్?

కష్టం విలువ తెలిసిన వారే మరొకరిని కష్టపెట్టకుండా చూసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక సినిమా ఇండస్ట్రీలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పైకి వచ్చిన వారే. అయితే ఆ చేదు అనుభవాలను దాటి వచ్చిన వారు మరొకరికి వీలైనంత త్వరగా అవకాశం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా సెట్ అవ్వాలి అంటే చాలా కష్టమైన పని. అయితే ప్రస్తుతం కొంతమంది యువ దర్శకులు మాత్రం షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వారి టాలెంట్ నిరూపించుకుంటూ నిర్మాతల నుంచి ఆఫర్స్ అనుకుంటున్నారు.

అయితే స్టార్ దర్శకుల వద్ద ఎన్నో ఏళ్ల నుంచి సహాయ దర్శకుడిగా పనిచేసిన వారు మాత్రం చాలా వరకు అలానే మిగిలిపోతున్నారు. కొందరు స్టార్ దర్శకులు మాత్రం అలాంటి వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక సుకుమార్ లాంటి కొంతమంది స్టార్ దర్శకులు మాత్రమే ఎక్కువగా తన శిష్యులకు అవకాశం ఇస్తున్నారు. సొంత బ్యానర్ లోనే కాకుండా ఇతర సంస్థలతో కలిసి సినిమాలు చేసే చాన్స్ ఇస్తున్నాడు. ఇక అదే బాటలో కొరటాల శివ కూడా వెళ్లనున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది.

Director koratala siva new movies with his new assistant directors

కొరటాల శివ కూడా ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ప్రస్తుతం అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్న కొరటాల శివ చిన్న సినిమాలు కూడా చేయాలని అనుకుంటున్నారు కానీ బిజీగా ఉండడం వల్ల కుదరడం లేదు. ఇక తను చేయలేకపోయిన చిన్న కథలను కొన్నింటిని తన శిష్యులతో చేయించాలని అనుకుంటున్నాడు. అయితే అందులో ఓటీటీ కథలు ఎక్కువగా ఉన్నాయట. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దర్శకుడి వద్ద ఎప్పటినుంచో నమ్మకంతో ఉన్న ముగ్గురు శిష్యులకు వీలైనంత త్వరగా అవకాశాలు ఇప్పించాలని సిద్ధమయ్యారట. అలాగే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఛాన్సులు రావాలని తనే సొంతంగా కథలు తయారు చేసి వారికి కెరీర్ కు హెల్ప్ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక సంస్థతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సంయుక్తంగా తన శిష్యుల కథలను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

ఇక ఎవరైనా సొంతంగా కథలు రాసుకుంటే కూడా కొరటాల వారికి సహాయం చేస్తున్నాడని తెలుస్తోంది. సుకుమార్ తరహాలోనే కొరటాల శివ కూడా ఎంత మంది శిష్యులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ స్టార్ దర్శకుడు ఆచార్య సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మెగా మల్టీస్టారర్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా తెరపైకి తీసుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న సినిమా దసరా రోజు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా వేడుకకు మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X