Jr NTR కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పవర్ఫుల్ పాత్రలో..
జూనియర్ ఎన్టీఆర్ RRR తర్వాత ఎలాగైనా మరొక పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని సిద్ధమవుతున్నాడు. అసలైతే ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ ఆ దర్శకుడు చెప్పిన కథ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా లేకపోవడంతో దాన్ని పక్కనపెట్టి కొరటాల శివ చెప్పిన మరో స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఆ కథలో కూడా కొన్ని సందేహాలు ఉండడంతో ఎన్టీఆర్ రిస్కు చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో కొరటాల శివ మరొక కథను చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ నటీనటుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల దర్శకుడు కొరటాల శివ పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ పనులు అయితే ముగించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా స్క్రిప్ట్ పై చాలా నమ్మకం గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక అందులో బలమైన పాత్రల కోసం ప్రముఖ నటీనటులు సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. అయితే దర్శకుడు కొరటాల ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఒక సీనియర్ హీరోయిన్ కోసం కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు విజయశాంతి అని సోషల్ మీడియాలో టాక్ వైరల్ గా మారుతుంది.

అప్పట్లో అగ్ర హీరోయిన్ గా స్టార్స్ తో కలిసి నటించిన విజయశాంతి కొన్నాళ్లకు రాజకీయాల్లో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఇక చివరిగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం ఒక పాజిటివ్ పాత్రలో కనిపించారు. అది కూడా తన క్యారెక్టర్ నచ్చినందుకే సినిమా చేసినట్లు ఆమె చెప్పారు. కానీ ఎక్కువగా మాత్రం సినిమాలు చేయలేను అని పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటాను అని అన్నారు.

ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత కొన్ని ఆఫర్లు వచ్చినప్పుడు కూడా విజయశాంతి అయితే ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 సినిమా కోసం కోసం సంప్రదించినట్లు సమాచారం. ఇంకా విజయశాంతి ఆ పాత్ర చేయడానికి గ్రీన్ సింగల్ ఇచ్చిందా లేదా అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ కొరటాల మాత్రం తను అనుకున్న పాత్రకు విజయశాంతి గారు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని మాత్రం నిర్మాతలతో చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ ఎన్టీఆర్ సినిమాలో విజయశాంతి నటిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











