Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Jr NTRతో అనుకున్న ప్రాజెక్ట్ బన్నీ చేతుల్లోకి.. పోస్టర్ కూడా విడుదల చేసి మాట తప్పిన దర్శకుడు
చాలా వరకు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న కథలు మరొక హీరో వద్దకు వెళ్లడం సర్వ సాధారణం. కొన్నిసార్లు ఆ ప్రాజెక్టులు డిజాస్టర్స్ అవ్వచ్చు మరికొన్ని సార్లు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టవచ్చు. ఇక కొరటాల శివ మొదటి మూడు కథలు కూడా మొదట వేరే హీరోలతో అనుకున్నావే. కానీ ఆ సినిమాలు అందుకున్న విజయం రిజెక్ట్ చేసిన వారికి షాక్ ఇచ్చాయి.
మొదటి మూడు సినిమాలు కూడా..
మిర్చి కథను మొదట ప్రభాస్ కంటే తక్కువ రేంజ్ హీరోలకు అనుకున్నప్పటికి వారి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ ఆ తరువాత ప్రభాస్ కోసం కొరటాల శివ మాస్ ఎలిమెంట్స్ లో కాస్త మార్పులు చేయడంతో సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అదే తరహాలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ ప్రాజెక్టులు కూడా మొదట అనుకున్న హీరోలతో రూపొందలేదు.
బన్నీతో సినిమా.. కథ ఎప్పటిదో?
అసలు మ్యాటర్ లోకి వస్తే.. కొరటాల శివ రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ కథను కొరటాల ఎప్పుడో రాసుకున్నాడు. యంగ్ జనరేషన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఆ కథ ఉంటుందని సమాచారం. బన్నీ కోసం ఇంకా కొన్ని మార్పులు చేయాల్సి ఉందని టాక్.
మొదట ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారు..
అయితే మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కథనో లేక వేరే కథనో తెలియదు గాని 2017లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో మరోసారి సినిమా చేయనున్నట్లు కొరటాల ఒక ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు బన్నీ సినిమాను నిర్మిస్తున్న యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లోనే అప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు పోస్టర్ కూడా వదిలారు.
Recommended Video
అదే ప్రాజెక్టు బన్నీ చేతుల్లోకి
జనతా గ్యారేజ్ హిట్టవ్వగానే 2017లో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఆ ఎనౌన్స్మెంట్ అప్పట్లో నందమూరి అభిమానులకు మంచి జోష్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే ప్రాజెక్టు బన్నీ చేతుల్లోకి వెళ్లినట్లు టాక్ వస్తోంది. తారక్ నో చెప్పాడో లేక కొరటాల యూ టర్న్ తీసుకున్నాడో తెలియదు గాని మొదట అనుకున్న కాంబినేషన్ లో మాత్రం హీరో చేంజ్ అయ్యాడు. మరి భవిష్యత్తులో ఈ విషయంపై ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.