కొత్త బంగారు లోకం తరహాలో శ్రీకాంత్ అడ్డాల ప్రయోగం.. అఖండ టీమ్ తో కలిసి..?
కొత్త బంగారులోకం సినిమా ద్వారా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. వరుణ్ తేజ్ తో ముకుంద సినిమా తర్వాత అతను ఏకంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త మల్టీస్టారర్ సినిమాలకు కార్యరూపం దాల్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్నంతగా కలెక్షన్ అందుకోక పోయినప్పటికీ మహేష్ బాబు వెంకటేష్ సింగల్ ఫ్రేమ్ లో చూడడం అభిమానులకు ఎంతగానో నచ్చింది.
అప్పుడే మల్టీస్టారర్ సినిమాలకు కూడా మళ్ళీ ఆజ్యం పోసినట్లు అయ్యింది. శ్రీకాంత్ అడ్డాల ఒక కథను రాసుకుని అంటే చాలా పర్ఫెక్ట్ గా తెరపైకి తీసుకు వస్తాడు అనే అప్పట్లో ఒక టాక్ గట్టిగానే వచ్చింది. అతనికి సరైన కథ దొరికితే మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయగలరు అని గతంలో ప్రకటించారు. అయితే మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ కాగా శ్రీకాంత్ అడ్డాల ఆ తరువాత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మధ్యలో ఎన్ని కథలు వ్రాసుకున్న కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

చాలామంది నిర్మాతలు చుట్టూ తిరిగిన శ్రీకాంత్ అడ్డాలకు అంత త్వరగా అవకాశాలు అయితే దొరకలేదు. ఇక మొత్తానికి సురేష్ బాబు పిలిచి అతని మీద నమ్మకంతో ఆసరన్ కథను రీమేక్ చేసే అవకాశం ఇచ్చాడు. అయితే వెండితెరపై విడుదల కావాల్సిన ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెలిసిందే. మొత్తానికి ఆ సినిమాను కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు గా తెరపైకి తీసుకువచ్చిన శ్రీకాంత్ అడ్డాల పెద్దగా మ్యాజిక్ క్రియేట్ చేయలేదు అని కూడా కామెంట్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత తనదైన శైలిలో ఒక క్యూట్ లవ్ స్టోరీ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శ్రీకాంత్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
గతంలో కొత్త బంగారులోకం సినిమా తరహాలో ఒక లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటునన్నాడట. అందులో ఒక మంచి సందేశం కూడా ఉండాలని డిసైడ్ అయ్యాడట.. శ్రీకాంత్ అడ్డాల నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అఖండ నిర్మాత ఫ్యామిలీ నుంచి రాబోయే ఒక న్యూ హీరో తో సినిమా చేయనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్గా క్లారిటీ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక శ్రీకాంత్ అడ్డాల లిస్టులో ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా చేయనున్నట్లు గతంలో ఒక టాక్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు పవన్ కోసం తొందరగా ఫినిష్ అయ్యేలా కథ కుడా రెడీ చేయమన్నాడట ఇక శ్రీకాంత్ అడ్డాల భవిష్యత్తు సినిమాలు ఏ తరహాలో సక్సెస్ అవుతాయో చూడాలి..


Click it and Unblock the Notifications











