For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సోనూ సూద్ హీరోగా పాన్ ఇండియా సినిమా.. కధ రెడీ చేసిన టాప్ డైరెక్టర్.. త్వరలో ప్రకటన?

  |

  సినిమాల్లో విలన్ పాత్రలు చేసే సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం అందరికీ హీరోగా మారాడు. భారతదేశాన్ని కరోనా కబళిస్తున్న వేళ తానున్నానని అభయమిస్తూ ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తూ వెళుతున్నాడు. సహాయం కోరడం ఆలస్యం తానున్నానని క్షణాల్లో వాలిపోతూ సేవ చేస్తున్నారు. అలాంటి ఆయన నన్ను ఇకమీదట విలన్ పాత్రలో చూపిస్తే ప్రేక్షకులు చూస్తారా లేదా అనే భయం దర్శకనిర్మాతలలో ఉంది. ఈ నేపథ్యంలో సోనూసూద్ హీరోగా ఒక టాప్ తెలుగు డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  తమిళ సినిమాతో ఎంట్రీ

  తమిళ సినిమాతో ఎంట్రీ


  ఎక్కడో పంజాబ్ లోని మారుమూల ప్రదేశంలో పుట్టిన సోనూసూద్ నటన మీద ఆసక్తితో ముంబై చేరుకున్నాడు. కానీ ఆయనకు బాలీవుడ్ అవకాశాలు ఇవ్వడం కంటే ముందే తమిళ తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కాయి. 99లో విడుదలైన తమిళ సినిమాలో ఆయన ఒక పూజారి పాత్రతో సినీ తెరంగ్రేటం చేశాడు. ఆ తర్వాత తమిళంలో మరో సినిమా చేసినా పెద్దగా గుర్తింపు దక్కలేదు.

  హ్యండ్సప్ అంటూ

  హ్యండ్సప్ అంటూ


  ఇక తర్వాత సంవత్సరం తెలుగులో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో సోనూసూద్ నటించారు. ఆ తరువాత కూడా ఆయనకు సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు . తెలుగు, తమిళ సినిమాలు అలాగే హిందీ సినిమాలలో వేటినీ వదలకుండా ఎందులో అవకాశం వస్తే అందులో చేసుకుంటూ వెళ్లారు సోనూసూద్.

  సూపర్ గా అతడు

  సూపర్ గా అతడు

  2005లో నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు రిలీజ్ అయిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలవడంతో సోనూసూద్ కి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి హీరోగా చేస్తున్న ఆచార్య అనే సినిమాలో విలన్ గా చేస్తున్నారు.

  సోనూని కొట్టలేక పోయిన చిరంజీవి

  సోనూని కొట్టలేక పోయిన చిరంజీవి

  అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో కూడా చిరంజీవి సోనూను కొన్ని సీన్స్ లో కొట్టాల్సి వస్తుంది. కానీ సోనూసూద్ చేస్తున్న సేవలని చూసిన చిరంజీవి ఆయనను కొట్టడానికి సైతం వెనుకాడారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన జరిగిన సమయంలోనే తాను ఇక విలన్ రోల్స్ చేయడం మానేస్తాను అని సోనూసూద్ ప్రకటించారు.

  హీరోగా ఛాన్స్ లు

  హీరోగా ఛాన్స్ లు


  ఇక అప్పటికే తనకు హీరోగా కొంతమంది స్క్రిప్ట్లు చెబుతున్నారని వీలైనంత త్వరలో నిర్మాతలను ఫైనలైజ్ చేసుకుని సినిమా ప్రకటిస్తానని కూడా గతంలో ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ రావడంతో మళ్లీ ఆయన సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు క్రిష్ సోనూసూద్ కోసం ఒక అద్భుతమైన కథ సిద్ధం చేశారని తెలుస్తోంది.

  ఆ డైరెక్టర్ కధకి గ్రీన్ సిగ్నల్

  ఆ డైరెక్టర్ కధకి గ్రీన్ సిగ్నల్

  ఇప్పటికే సోనూసూద్ కి క్రిష్ కథ వినిపించగా దానికి ఆయన ప్రాథమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సోనూసూద్ క్రిష్ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. మణికర్ణిక సినిమా నుంచి క్రిష్ తప్పుకున్న వెంటనే సోనూసూద్ కూడా తప్పుకున్నారు.

  AP : శభాష్ మగువా.. Sonu Sood కి పెన్షన్ విరాళమిచ్చిన యువతి!! || Filmibeat Telugu
  పవన్ సినిమా తరువాత

  పవన్ సినిమా తరువాత


  ఇక ప్రస్తుతానికి క్రిష్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలో కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇక పవన్ కూడా కరోనా బారిన పడడంతో ఆయన కోలుకున్నాకే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని భావించారు. ఈ లోపు సెకండ్ వేవ్ విధించారు.

  English summary
  Actor Sonu Sood has became national hero now. After his philanthropic work, many filmmakers have approached him with lead roles in their films. Now reports says that director Krish has been penning a story for Sonu Sood. The director approached the actor and got a nod from him. as per reports project will be made on a big scale in a pan India level.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X