పవన్‌ కల్యాణ్‌ని వదిలే ప్రసక్తే లేదట.. క్రిష్ ప్లాన్ మామూలుగా లేదు

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టడంతో సినిమా రిలీజ్ లు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. దీంతో షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. అయితే ఎందుకో పవన్ విరూపాక్ష క్యాన్సిల్ అయినట్లు రూమర్స్ రాగా ఆ దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితులు ద్వారా తెలిసింది.

 అందుకే వకీల్ సాబ్ పూర్తి కాలేదు

అందుకే వకీల్ సాబ్ పూర్తి కాలేదు

పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాల షూటింగ్స్ కారణంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. అందుకే చివరి దశలో మిగిలి ఉన్న వకీల్ సాబ్ షూటింగ్ ని కూడా పూర్తి చేయడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా లేదని దర్శకుడు ఇటీవల ఒక ఒక క్లారిటీ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ ప్రాజెక్టును వదిలే ప్రసక్తే లేదు

పవన్ కళ్యాణ్ ప్రాజెక్టును వదిలే ప్రసక్తే లేదు

ఇక మెగా యువ హీరో వైష్ణవ్ తేజ్ తో వెంటనే మరో సినిమాను ఎనౌన్స్ చేయడంతో క్రిష్ పవన్ సినిమాను క్యాన్సిల్ చేశాడని మళ్ళీ ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ లేదని రూమర్స్ వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రాజెక్టును వదిలే ప్రసక్తే లేదని క్రిష్ రూమర్స్ పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపినట్లు టాక్ వస్తోంది.

అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

నిజానికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చాలా మంది అగ్ర దర్శకులు వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారిలో క్రిష్ ఒకరు. వేదం సినిమా చూసిన తరువాత పవన్, క్రిష్ ని ప్రత్యేకంగా అభినందించారు. అవకాశం ఉంటే మనం కూడా ఒక సినిమా చేద్దామని అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అప్పట్లో లాయర్ సాబ్ అనే ప్రాజెక్ట్ కూడా వారి కాంబినేషన్ లో రానున్నట్లు రూమర్స్ వచ్చాయి.

పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తరువాతే

పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తరువాతే

ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్రిష్ సడన్ గా ఆయనతో సెట్టయిన ప్రాజెక్టును కూడా ఎలా క్యాన్సిల్ చేసుకుంటాడు అని రూమర్స్ కి కౌంటర్లు పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తరువాతే ఆయన మేనల్లుడి సినిమాను సెట్స్ పైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమా చిన్న బడ్జెట్ లోనే తెరకెక్కుతుండడంతో ఫినిష్ చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఇక ఆ తరువాత ప్లాన్ ప్రకారం క్రిష్, పవన్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X