Don't Miss!
- News
అందరి దృష్టీ ప్రధాని మోడీ ప్రసంగం మీదే: వరాలు..కొత్త పథకాలు?
- Lifestyle
Relationship Mistakes: గాఢమైన బంధంలో ఈ తప్పులు అస్సలే చేయొద్దు. జాగ్రత్త..!
- Technology
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- Sports
షాకింగ్ న్యూస్ చెప్పిన పీవీ సింధు.. గాయం వల్ల ఇక తప్పుకుంటున్నానంటూ ట్వీట్
- Finance
Rakesh Jhunjhunwala: బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా మృతి.. 62 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూత..
- Automobiles
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న 'ఓలా ఎలక్ట్రిక్ కారు'.. ఇలా ఉంటుంది
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
Lokesh Kanagaraj: తెలుగులో అగ్ర హీరోపై ఫోకస్ చేస్తున్న విక్రమ్ దర్శకుడు.. మరో బిగ్ ప్లాన్?
తమిళ చిత్ర పరిశ్రమలో ఇటీవల సంచలన విజయాన్ని అందుకున్న విక్రమ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఒక తమిళ సినిమా పెట్టిన పెట్టుబడికి అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అయితే అందించింది. కమల్ హాసన్ కూడా ఆ సినిమా విజయంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక చిత్ర దర్శకుడు త్వరలోనే తెలుగులో కూడా ఒక స్టార్ హీరో తో సినిమా చేయడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరు అనే వివరాల్లోకి వెళితే...

బిగ్గెస్ట్ హిట్
విక్రమ్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజు బాక్సాఫీస్ వద్ద సరికొత్త విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇంతకుముందు ఈ దర్శకుడు ఈ స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేదు. ఎందుకంటే విక్రమ్ సినిమా ఇప్పటివరకు తమిళనాడులోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.

ఫామ్ లోకి వచ్చిన కమల్
ఇక విక్రమ్ సినిమా విజయంతో కమల్ హాసన్ కూడా ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు అనే చెప్పాలి. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా పై చాలా మంది సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ అలాగే సూర్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ప్రత్యేకమైన బహుమతులు
సినిమా సక్సెస్ లో భాగమైన అందరికీ కూడా కమల్ హాసన్ ఏదో ఒక ప్రత్యేకమైన కనుక అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇటీవల యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా భోజనాలు కూడా పెట్టించారు. విక్రమ్ సక్సెస్ ఆనందానికి ముఖ్య కారణం అయినటువంటి డైరెక్టర్ లోకేష్ కోసం ప్రత్యేకంగా 60 లక్షల కారును బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ హీరోతో కాదని
అయితే ఈ దర్శకుడితో సినిమా చేయాలని టాలీవుడ్ హీరోలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే లోకేష్ రామ్ చరణ్ కలయికలో సినిమా రాబోతున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని లోకేష్ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

విక్రమ్ కథకు కొనసాగింపుగా..
ఇక భవిష్యత్తులో విక్రమ్ సినిమాకు సీక్వెల్ గా మల్టీ వర్డ్స్ ఫార్ములాతో అందరి హీరోల సూపర్ హీరోల తరహాలో లోలేష్ ఏకం చేయబోతున్నాడు. అందులో ఒక టాలీవుడ్ అగ్రహీరో ను కూడా కొత్త క్యారెక్టర్ తో పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని సమాచారం.

మహేష్ ఫోన్ చేయగానే..
ఇటీవల మహేష్ బాబు విక్రమ్ సినిమాను చూసి చిత్ర యూనిట్ సభ్యులందరిపై కూడా కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డైరెక్టర్ లోకేష్ తో కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే దర్శకుడు లోకేష్ మీతో కూడా ఓ సినిమా చేయాలని ఉందని అన్నాడట. ఇక భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టు కథ కోసం మరోసారి చర్చలు జరుపుతామని కూడా దర్శకుడు చెప్పినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.