twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దర్శకుడి నుంచి మరో పొలిటికల్ సినిమా.. ఈసారి టార్గెట్ చేసినట్టేనా?

    |

    తెలుగులో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత దర్శకుడిగా మారిన వాళ్లలో మహి వీ రాఘవ ఒకరు. విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ అనే సినిమాలను నిర్మించిన ఆయన దాదాపు మూడేళ్ళ తరువాత పాఠశాల అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా ఆయనకు పెద్దగా పేరు తెచ్చి పెట్టకపోయినా ఆ తర్వాత వచ్చిన ఆనందోబ్రహ్మ సినిమా మాత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన ఇప్పుడు మరో పొలిటికల్ సినిమాకి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. మాస్టర్ హీరోయిన్ హాట్ ఫోటో గ్యాలరీ..

    ప్రొడ్యూసర్ టు డైరెక్టర్

    ప్రొడ్యూసర్ టు డైరెక్టర్

    మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందిన మహీ అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ వ్యాపారం చేసే స్థాయికి ఎదిగారు. ఆయన విదేశాల్లో సైతం వ్యాపారం చేసేవారు. అయితే సినిమాల మీద ఆయనకున్న ఆసక్తితో 2008లో భారత్ తిరిగి వచ్చిన ఆయన ఆ సమయంలో సాయికిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కిన వినాయకుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత సాయి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన విలేజ్ లో వినాయకుడు సినిమాకి ప్రొడ్యూసర్ గా మారాడు. తన స్నేహితులతో కలిసి మూన్ వాటర్ పిక్చర్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ స్థాపించిన ఆయన ఆ తర్వాత అదే బ్యానర్ లో తాను కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

    రెండో సినిమాకి హిట్

    రెండో సినిమాకి హిట్

    ముందుగా పాఠశాల అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాకపోతే ఆ సినిమాకు ఆయనకు గుర్తింపు దొరకలేదు. 2017 లో ఆయన తాప్సీ లీడ్ రోల్ లో చేసిన ఆనందోబ్రహ్మ సినిమాకు దర్శకత్వం వహించారు. తాప్సీ పన్ను, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, విజయచందర్, షకలక శంకర్ లాంటి వాళ్లు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. ఇదే సినిమాను తమిళ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు.

     యాత్రతో మంచి గుర్తింపు

    యాత్రతో మంచి గుర్తింపు

    2019లో ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలల ముందు ఆయన యాత్ర సినిమా రిలీజ్ చేశారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్ర కు సంబంధించిన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించగా ఈ సినిమా కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ''నేను విన్నాను నేను ఉన్నాను'' అని ఈ సినిమా కోసం మహి రాసిన ఒక డైలాగ్ ఏపీలో వైసీపీకి స్లోగన్ గా మారిపోయింది.

    పొలిటికల్ సెటైర్ మూవీ

    పొలిటికల్ సెటైర్ మూవీ

    అయితే ఇప్పుడు మహి వీ రాఘవ ఒక పొలిటికల్ సెటైర్ మూవీ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వైఎస్ జగన్ తో కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన పొలిటికల్ సెటైర్ మూవీ చేస్తున్నారు అనగానే అది జగన్ కు వ్యతిరేకంగా పని చేసే మీద అనే అనుమానాలు కలగడం సహజం.. ఆయన తెలంగాణ పాలిటిక్స్ మీద దృష్టి కేంద్రీకరించి అవకాశం లేదు కాబట్టి ఏపీ పాలిటిక్స్ మీదే ఈ సినిమా తీసే అవకాశం ఉందని అంటున్నారు..

    శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ లో

    శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ లో

    ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ లో నటిస్తుంది అని అంటున్నారు. అలాగే మరికొందరు కమెడియన్స్ కూడా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎవరి మీద అయితే సెటైరిక్ గా తీయాలని అనుకుంటున్నారో వాళ్లను మహి గట్టిగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని, వీలైనంత త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.

    Recommended Video

    '1992' Movie CHELIYA CHELIYA Lyrical Video Launched By Raj Kandukuri
    నితిన్ తో కూడా సినిమా

    నితిన్ తో కూడా సినిమా

    మరోపక్క ఆయన యూవీ బ్యానర్ లో కూడా ఓ సినిమా చేస్తారని అంటున్నారు. యూవీ బ్యానర్ వాళ్లు మూడు స్మాల్ బడ్జెట్ సినిమాలు తీయాలని ప్లాన్ చేశారు. అందులో ఇప్పటికే రెండు సినిమాలు కాంబినేషన్ సెట్ అయిపోగా మూడో సినిమా మహీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం నితిన్ ను సంప్రదించారని కూడా ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    English summary
    Tollywood director Mahi Raghava who had made the film “Yatra,” a semi-biopic on Jagan’s father late Dr Y S Rajasekhar Reddy, former chief minister of AP is again in news. There are some reports state that Mahi is working on a new film which is going to be political satire.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X