టీవీ యాంకర్ ను పెళ్లాడిన సినిమా డైరెక్టర్???
ఒక టెలివిజన్ యాంకర్ ను సినిమా దర్శకుడు పెళ్లి చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడేమో రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీ నుంచి వచ్చాడట. మూడు నాలుగేళ్ల క్రితం సినిమా దర్శకుడిగా మారిన ఈయన తొలుత కెమరామెన్ అట. ఆ తరువాత దర్శకుడిగా మారి క్లాస్ సినిమా తీసి ప్రశంసలు పొందాడు కూడా. ఆ తరువాత మాస్ సినిమా కూడా తీసాడుట. ప్రస్తుతం ఒక లవ్ స్టోరీ నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఆడియోను కూడా ఇటీవలే విడుదల చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆంధ్ర అమ్మాయి చేసింది. హైదరాబాద్, అమెరికాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది.
ఇక టీవీ యాంకర్ విషయానికి వస్తే ఆమె చాలా ఫేమస్. గోపీచంద్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసింది. ఈ సినిమా హీట్ అయింది కూడా. ఆ సినిమా తరువాత ఆమెకు అవకాశాలు రాలేదు. వీరిద్దరూ కలిసి తిరుగుతున్నట్టు పుకార్లు వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ పుకారు ఇపుడు నిజమైందని విస్మయం చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











