మరో ఇంట్రెస్టింగ్ కథను సెట్ చేసుకున్న మారుతి.. హీరో ఎవరైనా ఆ పాత్రలోనే..
దర్శకుడు మారుతి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కథ కంటే కూడా ఎక్కువగా కామెడీ సీన్స్ తోనే మంచి హైప్ క్రియేట్ చేస్తారు. ఒక చిన్న పాయింట్ దొరికితే చాలు. దాన్ని వెండితెరపై ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సెట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ దర్శకుడు ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రతి రోజు పండగే సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టినప్పటికి మారుతి ఇంకా నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు.
అయితే కథలను మాత్రం గట్టిగానే సెట్ చేసుకున్నారట. అయితే కథలు ఎన్ని ఉన్నా కూడా హీరోలు మాత్రం దొరకడం లేదు. రామ్ పోతినేని, గోపిచంద్, నాని వంటి హీరోలను అనుకుంటున్నట్లు టాక్ అయితే వచ్చింది గాని ఇంకా ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అల్లు అర్జున్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉందని రూమర్స్ రాగా అందులో నిజం లేదని అర్ధమైపోయింది. అయితే హీరో ఎవరైనా కూడా మారుతి నెక్స్ట్ సినిమాలో మాత్రం కథానాయకుడు ఒక లాయర్ గా కనిపిస్తాడట.

న్యాయవాది కాన్సెప్ట్ లో ఫుల్ కథను సెట్ చేసుకున్న మారుతి చట్టాల్లో ఉన్న లోపాలపై సీన్స్ ని చాలానే రాసుకున్నారట. అందులోనే టైమింగ్ ఉన్న మంచి కామెడీని సీన్స్ ని మిక్స్ చేసి ఒక మంచి మెస్సేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథను కొంచెం హై బడ్జెట్ లోనే రూపొందించే అవకాశం ఉందట. చేస్తే పెద్ద హీరోతోనే చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. అందుకే హీరో సెట్టయిన తరువాతనే ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని మారుతి ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











