ప్రభాస్ తమ్ముడు అస్సలు తగ్గట్లేదుగా.. ఒక్క సినిమాతోనే యూ టర్న్.. మరో బంపర్ ఆఫర్
సినిమా ఇండస్ట్రీలో స్టార్ అవ్వడం అనేది అంత ఈజీ కాదని అందరికి తెలిసిన విషయమే. కష్టమని తెలిసినా కూడా చాలామంది రిస్క్ చేసి మరి జీవితంలో సగం సమయాన్ని ప్రయత్నాల కోసమే కేటాయిస్తారు. ఇక ఇటీవల ఒక యువ హీరో కూడా అన్న ప్రభాస్ సపోర్ట్ ఉన్నప్పటికీ సొంతంగా ప్రయత్నాలు చేసి మరి అవకాశాలు అందుకుంటున్నాడు. ఇక అతనికి ఛాన్సులు తగ్గిన సమయంలోనే ఒక అన్నగా అండగా నిలబడ్డాడు ప్రభాస్. దీంతో అతని జీవితమే మారిపోయింది.

నిజమైన రాజుగారు
ప్రభాస్ ఒక్కసారి నమ్మాడు అంటే ఎవరిని కూడా అంత ఈజీగా దూరం చేసుకోరు. దాదాపు అతని చుట్టూ కూడా స్నేహితులే ఉంటారు. తన అసిస్టెంట్ ను కూడా ప్రభాస్ ఒక స్నేహితుడి లానే చూస్తాడు. డార్లింగ్ తో వర్క్ చేసిన వారెవరైనా సరే అతని తీరుకు నిజమైన రాజు అంటూ కామెంట్స్ చేస్తుంటారు.

సహాయం చేసిన వాళ్ళను
ప్రభాస్ తనకు సహాయం చేసిన వాళ్ళను ఎవరిని మరచిపోడు. చాలామందికి కష్టాల్లో లైఫ్ ఇచ్చిన డార్లింగ్ కొంతమంది సినిమాల్లో ఛాన్సులు కూడా ఇప్పించాడు. ఒకప్పుడు సహాయం చేసిన వారు ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారి కోసం ఎందాకైనా వెళతాడు అని అందరికి తెలిసిన విషయమే.

ఒక అన్నలగా నిలబడిన ప్రభాస్
ఇక ఒకప్పుడు వర్షం సినిమాతో మొదటి విజయాన్ని అందించిన డైరెక్టర్ శోభన్ ను కూడా ప్రభాస్ మర్చిపోలేదు. అతను చనిపోయినా కూడా అతని కుటుంబాని వదిలి పెట్టలేదు. ఇక శోభన్ కొడుకు సంతోష్ శోభన్ హీరోగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఎంకరేజ్ చేసిన ప్రభాస్ అతనికి ఒక అన్నలగా అండగా నిలిచాడు.

వరుసగా ఆఫర్లు వస్తున్నాయి
యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన యూవీ కాన్సెప్ట్స్ లో ఇటీవల ఏక్ మినీ కథ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా థియేట్రికల్ గా విడుదల కాకపోయినా కూడా డైరెక్ట్ ఓటీటీలో మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. ఇక ప్రస్తుతం అతనికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే స్వప్న సినిమాస్ లో ఒక సీసీనిమాకి గ్రేన్ సిగ్నల్ ఇవ్వగా ప్రేమ కుమార్ అనే మరో సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు..

మారుతి కథలో కూడా...
ఇక యూవీ క్రియేషన్స్ లోనే మరో రెండు సినిమాలు చేయాల్సి ఉందట. ఇటీవల దర్శకుడు మారుతి ఒక కంటెంట్ ను కూడా రెడీ చేసినట్లు సమాచారం. సంతోష్ శోభన్ హీరోగా చేయబోయే ఆ కథపై మారుతి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు సమాచారం. ఒక్క నెలలోగా షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక అతనికి ఈ విధంగా ప్రభాస్ అండగా నిలుస్తున్నాడు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











