twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శక్తి, షాడో డిజాస్టర్స్ అనంతరం మెగాస్టార్ మూవీకి డైరెక్షన్.. మెహర్ రమేష్ నెల జీతం

    |

    సినిమా ప్రపంచంలో సక్సెస్ ఉన్నంతకాలం ఎవరికైనా సరే తగిన అవకాశాలు వస్తాయి. కానీ కొందరు మాత్రం ఎలాంటి రిజల్ట్ అందుకున్నా సరే అదృష్టం కొద్దీ కొనసాగుతూనే ఉంటారు. ప్లాప్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా ఛాన్స్ లు అందిపుచ్చుకుంటారు. గత కొంత కాలంగా అలాంటి అదృష్టంతో కొనసాగుతున్న దర్శకులలో మెహర్ రమేష్ ఒకరు. ఈ దర్శకుడు డిజాస్టర్స్ చూసినప్పటికి అవకాశాలు చాలానే వస్తున్నాయి. శక్తి, షాడో వంటి బిగ్ డిజాస్టర్స్ అనంతరం అసలు దర్శకుడికి మళ్లీ అవకాశాలు రావని చాలా మంది అనుకున్నారు. చాలా కథనాలు కూడా వచ్చాయి.

    కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో అభిమానులు షాకయ్యారు. ఇక అలాంటి డిజాస్టర్స్ అందుకున్న దర్శకుడి రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది టాపిక్ గా మారింది అతనికి నెల జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..

    దేశముదురు, పోకిరిలో మెహర్ రమేష్ హ్యాండ్

    దేశముదురు, పోకిరిలో మెహర్ రమేష్ హ్యాండ్

    మెహర్ రమేష్ మొదట నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా స్టార్స్ తో అతనికి మంచి స్నేహం ఉండడం వలన తొందరగా అవకాశాలు వచ్చాయి. 2001లో మహేష్ బాబు బాబీ సినిమాలో ఒక ఫ్రెండ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

    అనంతరం నటుడిగా పలు అవకాశాలు వచ్చినప్పటికీ రమేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దర్శకుడు అవ్వాలని ప్రయత్నాలు చేసే సహాయక దర్శకుడిగా పని చేశాడు. పూరి జగన్నాథ్ వద్ద కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, బాచి సినిమాలకు సహాయక దర్శకుడిగా పనిచేసిన మెహర్ రమేష్ అనంతరం మహేష్ బాబు పోకిరి సినిమా స్క్రిప్ట్ విషయంలోకు సహాయం చేశాడు. అంతకుముందే అల్లుఅర్జున్ దేశముదురు సినిమా కూడా అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాడు.

    ప్లాప్ కథతో సక్సెస్

    ప్లాప్ కథతో సక్సెస్

    దేశముదురు, పోకిరి వంటి విజయవంతమైన సినిమాల్లో మెహర్ రమేష్ కీలక పాత్ర వహించడంతో అప్పుడే ఇండస్ట్రీలో అతనిపై నమ్మకం ఏర్పడింది. సహాయ రైటర్ గా మంచి గుర్తింపు పొందిన మెహర్ రమేష్ డైరెక్షన్ లో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. మొదటి తమిళ్ లో వీర కన్నడిగా పేరుతో ఆంధ్రవాలా సినిమాను రీమేక్ చేశాడు. తెలుగులో డిజాస్టర్ అయిన ఆ కథ తమిళంలో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఒక్కడు సినిమాను కూడా కన్నడలో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

    డైరెక్షన్ లో అదృష్టం

    డైరెక్షన్ లో అదృష్టం

    2008లో ఎన్టీఆర్ తో కంత్రి సినిమాను తెరకెక్కించి పర్వాలేదనిపించాడు. అనంతరం ప్రభాస్ తో బిల్లాను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక వైజయంతి మూవీస్ లో శక్తి సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆ సినిమాతోనే మెహర్ రమేష్ స్థాయి ఒక్కసారి పడిపోయింది. మళ్లీ అవకాశాలు రావేమో అని చాలామంది అనుకున్నారు. అయినప్పటికీ అతని అదృష్టం వలన 2013లో వెంకటేష్ శ్రీకాంత్ తో షాడో సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో రమేష్ మళ్ళీ కనిపించలేదు.

    డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు..

    డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు..

    చాలా కాలం డిప్రెషన్ లోకి వెళ్ళినట్లు కూడా టాక్ వచ్చింది. ఇక ఆ మధ్య మెగా ఈవెంట్స్ లో కనిపించని మెహర్ రమేష్ మధ్య మధ్యలో మహేష్ బాబు తో కూడా ట్రావెల్ అవుతూ వచ్చాడు. ఇండస్ట్రీలో స్టార్స్ అందరూ అతని స్నేహితులు కావడం వలన మెహర్ రమేష్ కు ఎదో ఒక విధంగా హెల్ప్ చేయాలని అనుకున్నారు. ఇక ఇక తను రీమేక్స్ లో ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి మరో ఛాన్స్ ఇచ్చారు.

    వేదాళం రీమేక్

    వేదాళం రీమేక్

    తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు మెహర్ రమేష్ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. శక్తి షాడో సినిమా డిజాస్టర్స్ అయిన అనంతరం అతనికి అవకాశాలు ఇవ్వడానికి చాలా మంది భయపడ్డారు. అలాంటిది మెగాస్టార్ ఇచ్చారు అంటే అతనిపై నమ్మకం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

    ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మాతగా మెగాస్టార్ వేదాళం రీమేక్ కోసం ఈ దర్శకుడు కష్టపడుతున్నాడు. రమేష్ సినిమా కోసం గత తొమ్మిది నెలలుగా స్క్రిప్ట్ ను మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఉండాలని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    ఇక అతనికి ప్రస్తుతం అయితే నెల జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నెలకు ఐదు లక్షల వరకు ఇస్తున్నారట. సినిమా కమిట్మెంట్ ఇచ్చినప్పుడు 10లక్షలు అడ్వాన్స్ అయితే ఇచ్చారట. మొత్తంగా సినిమా పూర్తయ్యే వరకు రమేష్ కో ఒక కోటి యాభై లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఒక విధంగా ఆ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం అంటే అదృష్టమనే చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద అందుకనే కలెక్షన్స్ బట్టి లాభాల్లో అతనికి 25 నుంచి 30 శాతం షేర్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Recommended Video

    Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
    రిలీజ్ ఎప్పుడంటే?

    రిలీజ్ ఎప్పుడంటే?

    ఇక సినిమా విషయానికి వస్తే తమిళంలో అజిత్ నటించిన ఈ యాక్షన్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందట. మెగాస్టార్ చిరంజీవి సిస్టర్ గా మొదట సాయి పల్లవిని అనుకున్నట్లు టాక్ వచ్చింది. అనంతరం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టి వచ్చే ఏడాది చివర్లో లేదా 2023 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    Director meher ramesh remuneration for megastar chiranjeevi vedalam remake
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X