Bhola Shankar Movie: ఆ ఒక్క సెంటిమెంట్ క్లిక్ అయితే.. భోళా శంకర్ హిట్టే!
మెగా స్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్టును అందుకున్నాడు. అదే జోష్ తో మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాను చేస్తున్నాడు. మెహర్ రమేష్.. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఈయనకు తెలుగులో ఒక్క హిట్టు కూడా లేదు. అలాంటి దర్శకుడికి చిరు పిలిచి ఛాన్స్ ఇవ్వడం వెనుక ఓ సెంటిమెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....
తెలుగులో అన్నీ ఫ్లాప్స్ యే..:మెహర్ రమేశ్.. తెలుగులో ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి సినిమాలు తీయగా.. ప్రభాస్ తో బిల్లా, వెంకటేష్ తో షాడో సినిమాలు తీసి వారి కెరియర్ కి డిజాస్టర్లు అందించాడు. ఈ సినిమాల్లో ఒక్క బిల్లా తప్ప... అన్ని చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇక శక్తి సినిమా నిర్మాత అశ్వనీదత్త్ కు మాత్రం కమర్షియల్ గా దెబ్బకొట్టింది కూడా. ఆ నష్టాల నుంచి ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టిందట.

అందుకే చిరంజీవి ఛాన్స్..: ఈ ఫ్లాప్ తర్వాత ఈ డైరెక్టర్ కు తెలుగులో మళ్లీ ఛాన్స్ రాలేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పిలిచి భోళా శంకర్ సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాప్ డైరెక్టర్ కు మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వడం వెనుక ఓ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. అందువల్లే ఈ ఫ్లాప్ డైరెక్టర్ కు చిరంజీవి ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. అటు మెహర్ రమేష్ కూడా ఆ సెంటిమెంట్ ధైర్యంతోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఆ సెంటిమెంట్ ఏంటంటే...:మెహర్ రమేష్.. తెలుగులో తీసినవన్నీ స్ట్రేట్ సినిమాలు. అయితే వేరే భాషల్లో రీమేక్ కథలతో సూపర్ హిట్లను అందుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంధ్రావాలా సినిమాతో కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడు సినిమాని అజయ్ టైటిల్ కన్నడలో రీమేక్ చేస్తే అది కూడా సూపర్ హిట్ అయ్యింది.

రీమేక్ లతో మెహర్ రమేష్ హిట్లు:కన్నడలో పునీత్ రాజ్ కుమార్ కు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన మెహర్ రమేష్.. తమిళంలో అజిత్ హీరోగా నటించిన బిల్లా మూవీని తెలుగులో ప్రభాస్ హీరోగా రీమేక్ చేశాడు. ఇక ఈ సినిమా టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా పర్వాలేదనిపించింది. ఇలా రీమేక్ సినిమాలు చేసి.. మెహర్ రమేష్ హిట్లు కొట్టాడు.

అది వర్కౌట్ అయితే భోళా శంకర్ హిట్టే..:ఇప్పుడు చిరంజీవితో తెరకెక్కించే భోళాశంకర్ కూడా తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది. దీనితో ఈ సినిమా కూడా హిట్ అనే సెంటిమెంట్ ను నమ్ముతున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించగా.. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్, లవర్ బాయ్ పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా హిట్ అనే అటు అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. చూాడలి ఇక ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











