Project K: ప్రభాస్ 500 కోట్ల మూవీ.. రాబోయే మరో సినిమాతో పోలికలు.. మళ్ళీ మార్పులు?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా డార్లింగ్ వరుస బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా కథలను వెండితెరపైకి తీసుకు రాబోతున్నాడు. తప్పకుండా ఆ సినిమాలు బాహుబలి కంటే ఎక్కువ స్థాయిలో సక్సెస్ అవుతాయని అందరిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్ట్ K పై అయితే అంచనాలు మామూలుగా లేవు. ఇక ఆ సినిమా విషయంలో ఇటీవల దర్శకుడు ఒక కీలక మార్పును చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Prabhas Project K| AP Movie Tickets Rates| Tollywood Updates | Filmibeat Telugu
నెంబర్ వన్ హీరో

నెంబర్ వన్ హీరో

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రస్తుతం అందరికంటే ఎక్కువ స్థాయిలో బిగ్ బడ్జెట్ సినిమాలను చేస్తున్న నెంబర్ వన్ హీరో ప్రభాస్. బాహుబలి అనంతరం సాహో అంతగా సక్సెస్ కాకపోయినప్పటికి డార్లింగ్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక విధంగా అంతకు మించి అనే తరహాలోనే సినిమాలను తెరపైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

రాధేశ్యామ్ ఎప్పుడు?

రాధేశ్యామ్ ఎప్పుడు?

ఇక రాధేశ్యామ్ సినిమా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆ సినిమా వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఆ సినిమా అనంతరం సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఆ సినిమా ఫినిష్

ఆ సినిమా ఫినిష్

ఇక సలార్ సినిమా అనంతరం ప్రభాస్ ఆది పురుష్ ఇదే ఏడాదిలో వచ్చే అవకాశం ఉంటుందట. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు దాదాపు ఫినిష్ అయ్యాయి. గ్రాఫిక్స్ సినిమా కావడంతో ప్రస్తుతం చిత్ర యూనిట్ ఎక్కువగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తప్పకుండా ఆ సినిమా కూడా అంతకు మించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు.

ప్రాజెక్ట్ K.. ఆ సినిమాతో పోలిక

ప్రాజెక్ట్ K.. ఆ సినిమాతో పోలిక

అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K 2023 సమ్మర్ లో వస్తుందని చెబుతున్నారు. కానీ ఆ సమయానికి అన్ని పనులు ఫినిష్ అయితే గాని ఒక నమ్మకం లేదు. అయితే ఆ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల ఒక కీలక మార్పు చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో ఒక ఎపిసోడ్ రాబోయే మరొక సినిమాతో పోలి ఉందని అందుకే స్క్రిప్ట్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

స్క్రిప్ట్ లో చేంజ్ చేసే అవకాశం

స్క్రిప్ట్ లో చేంజ్ చేసే అవకాశం

ప్రాజెక్ట్ K లో ఒక ఫ్యూచర్ టైమ్ మెషిన్ ఫిల్మ్ అని ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే అందులో ఒక పాయింట్ లో ఒక ప్రధాన ఆయుధం చుట్టూ ఎపిసోడ్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సీన్స్ రణ్ బీర్ బ్రహ్మాస్త్ర సినిమాకి దగ్గరగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 500కోట్ల ప్రాజెక్ట్ లో అలాంటి ఓకే రకమైన సీన్స్ ఉండకూడదు అని దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ లో చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X