సునీల్ హీరోగా నెక్ట్స్ ఎవరి దర్శకత్వంలో....
రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న చిత్రంలో చేస్తున్న సునీల్ కి హీరోగా ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. తెలుగులో పెద్ద దర్శకులు సైతం అతనితో చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో రవితేజతో ఆంజనేయులు చిత్రం రూపొందించిన పరుశరామ్..సునీల్ తో సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రాన్ని ఇంతకుముందు అజయ్ తో ఆ ఒక్కడు, జగపతి బాబుతో ప్రవరాఖ్యుడు నిర్మించిన టాలీ టు హాలీ సంస్ధ వారు నిర్మించనున్నారు. జూన్ నెలాఖరుకు ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది. పరుశరామ్ మొదట తన స్క్రిప్టుని గోపీచంద్ హీరోగా రాసుకుని సంప్రదించారు. కొద్ది నెలలు పాటు సిట్టింగ్స్ జరిగాయి. అయితే స్క్రిప్టులో గోపీచంద్ మేజర్ మార్పులు సూచించటంతో పరుశరామ్ బయిటకు వచ్చి సునీల్ తో ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. ఆంజనేయులు, యువతలో కామెడీ పార్ట్ బాగా పండటంతో సునీల్ చిత్రం కూడా బాగానే నవ్విస్తాడని ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications