SS Rajamouli: హమ్మా.. ప్రశాంతూ.. జక్కన్ననే మోసం చేశావా?
ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి అటు నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకొని విజయవంతంగా అనేక కోట్ల రూపాయల కొల్లగొడుతూ ముందుకు వెళుతుంది. అయితే నిజానికి ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్... రాజమౌళి సహా ప్రేక్షకులందరికీ మోసం చేసినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ విషయంలోకి వెళ్తే
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సలార్ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మధ్యలో ఉండగానే రెండు భాగాలుగా సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగానికి సలార్ సీజ్ ఫైర్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా... రెండో భాగానికి శౌర్యంగా పర్వం అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు అధికారికంగా మొదటి సినిమా చివరిలో క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సినిమా కోసం ముందుగా ఒక టీజర్ రిలీజ్ చేశారు. సలార్ టీజర్ లో టీనూ ఆనంద్ ప్రభాస్ ను ఒక డైనోసార్ తో పోలుస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ప్రభాస్ ని డైనోసార్ అనే చాలామంది ప్రస్తావిస్తున్నారు. అంటే అది ఎంతగా ప్రేక్షకులలోకి చొచ్చుకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ప్రశాంత్ నీల్... ప్రభాస్ తో చేసిన ఇంటర్వ్యూలో సైతం ఇదే డైనోసార్ పదాన్ని వాడుతూ ఆ టీజర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని రాజమౌళి చెప్పుకొచ్చాడు. అయితే సినిమా చూసిన తర్వాత అసలు ఆ డైలాగ్ మొత్తం లేకుండా పోయింది.
బహుశా సెకండ్ పార్ట్ లో ఆ డైలాగ్ చూపిస్తారేమో తెలియదు. కానీ ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారేమో అని ఆసక్తిగా ఎదురుచూసిన రాజమౌళి సార్ మిగతా అభిమానులు అందరూ మోసపోయినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని హోంబలే ఫిలిం సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో ప్రభాస్ శృతిహాసన్ తో పాటుగా పృథ్వీరాజ్ సుకుమారం జగపతిబాబు సప్తగిరి, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించారు.
ఇక ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు బద్దలు కొట్టిన సలార్ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా ముందుకు దూసుకు వెళ్తోంది. మొదటి రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మూడో రోజు అయిన ఆదివారం కూడా బుకింగ్స్ హౌస్ ఫుల్ గానే కనిపిస్తూ ఉండడంతో భారీగా వసూళ్లు నమోదయ్య అవకాశం ఉంది. దానికి తోడు టికెట్ రేట్లు భారీగా పెంచి అమ్ముతున్న నేపథ్యంలో అనేక రికార్డులు బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











