NTR 31: పవర్ఫుల్ టైటిల్ వేటలో ప్రశాంత్ నీల్.. పాత్రకు తగ్గట్టుగా ఒకటి ఫిక్స్?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న హీరోలలో ఎన్టీఆర్ కూడా స్పీడ్ పెంచుతున్నాడు. RRR సినిమా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా సొంతం చేసుకున్న తర్వాత తదుపరి సినిమాలతో కూడా అదే తరహాలో తన పాన్ ఇండియా మార్కెట్ ను పెంచుకోవాలని అనుకుంటున్నాడు.

ఇక ఎన్టీఆర్ చేయబోయే సినిమాల లిస్టు లో అందరి ఫోకస్ ఎక్కువగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 31వ సినిమా పైనే ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై ఇటీవల చిత్ర యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఆ టైటిల్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

బిగ్గెస్ట్ హిట్

బిగ్గెస్ట్ హిట్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తన విజయాన్ని షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల కలెక్షన్స్ అందుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అయితే ఆ తరువాత రాబోయే సినిమా కూడా అంతకుమించి అనేలా ఉండాలి అని ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా కోసం భారీగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయితే ఈ నెలలోనే మొదలు అయ్యే అవకాశం ఉంది.

ఇదే ఏడాది పూర్తి చేసి..

ఇదే ఏడాది పూర్తి చేసి..

అలాగే ఎన్టీఆర్ KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దర్శకుడు ప్రభాస్ తో సలార్ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరగా ఇదే ఏడాది పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

NTR31 వచ్చేది ఎప్పుడంటే?

NTR31 వచ్చేది ఎప్పుడంటే?

ఇక ఎన్టీఆర్ సినిమాను వచ్చే ఏడాది మొదట్లోనే స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ తో ఎన్టీఆర్ 30వ సినిమా ఈ ఏడాది చివర్లో నే పూర్తి చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. 2023 సమ్మర్లో 31 వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వీలైనంత త్వరగా పూర్తి చేసి 2024లో మొదట్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాడు.

టైటిల్ ఫిక్స్?

టైటిల్ ఫిక్స్?

అయితే NTR 31 సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో దర్శకుడు ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ విషయంలో పెద్దగా ఆలస్యం చేయకుండా షూటింగ్ మొదలైనప్పుడే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తాడు. టైటిల్ తోనే సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయాలి అని అనుకుంటాడు. కాబట్టే ప్రస్తుతం ఒక నాలుగైదు టైటిల్స్ పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

 ఎన్టీఆర్ పాత్రకు తగ్గట్టుగా..

ఎన్టీఆర్ పాత్రకు తగ్గట్టుగా..

ఇక ఎన్టీఆర్ పాత్రకు తగ్గట్టు సెట్ అయ్యే విధంగా ఉండాలి అని దర్శకుడు ప్రశాంత్ ఇటీవల అసుర అనే ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ అయితే సినిమాకు కరెక్టుగా సరిపోతుంది అని.. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుంది అని అసుర అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే ఒక క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X