Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Prashanth Neel తో మరో టాలీవుడ్ హీరో.. తెరపైకి ఎవరూ ఊహించని కాంబినేషన్!
KGF 2 సినిమా తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ భవిష్యత్తులో ఎక్కువగా తెలుగు హీరోలతో బిజీ అయ్యేవిధంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను ప్రభాస్ తో సలార్ అనే మూవీతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న సలార్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అని ఒక నమ్మకం అయితే ఉంది. ఎన్టీఆర్ తో కూడా ఇటీవల ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ప్రశాంత్ నీల్ మనసులో మరొక తెలుగు హీరో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
టాప్ దర్శకుల్లో ఒకరిగా..
కన్నడ చిత్ర పరిశ్రమలో గతంలో ఎప్పుడూ లేని విధంగా KGF చాప్టర్ 1 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2తో అనుకున్నట్టుగానే మరొక బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. KGF 2 సినిమా 1000 కోట్ల వసూళ్లను అందుకుంటుంది అని ఎవరూ ఊహించలేకపోయారు. ఆ ఒక్క కాన్సెప్ట్ తోనే ప్రశాంత్ ఇప్పుడు దేశవ్యాప్తంగా టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులు
ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే ఇప్పటికే సగానికి చేరుకుంది. మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ తో కూడా
ప్రభాస్ సలార్ తరువాత కూడా దర్శకుడు ప్రశాంత్ మళ్ళీ తెలుగు హీరోతోనే సినిమా చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ 31వ సినిమాపై ఇటీవల అఫీషియల్ గా మరో క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరో తెలుగు హీరోపై ఫోకస్
అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ మరొక తెలుగు హీరో తో కూడా ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అది కూడా ఒక మాస్ స్టార్ హీరో కాకుండా నేచురల్ హీరో ని సెలెక్ట్ చేయాలని అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు అని కూడా అనిపిస్తుంది.
నానితో సినిమా?
ఇక ఆ తెలుగు హీరో మరెవరో కాదు. నేచురల్ స్టార్ నాని అని తెలుస్తోంది. ప్రశాంత్ ఎన్టీఆర్ 31వ సినిమా తర్వాత నానితో ఒక సినిమా చేయబోయే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆ ప్రాజెక్ట్ నాని స్టైల్ లో ఉంటుందా లేదంటే దర్శకుడు ప్రశాంత్ యధావిధిగా తన స్టైల్ ను ఫాలో అవుతాడా అనేది తెలియదు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. అలాగే ప్రశాంత్ నీల్ KGF3 సినిమాతో పాటు తెలుగులో రామ్ చరణ్ తో కూడా సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.