KGF 2: మరోసారి రీ షూట్ టెన్షన్.. ప్రభాస్ సినిమాకు కూడా బ్రేక్ ఇచ్చేసిన డైరెక్టర్..?
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియాలలో ఒకటైన KGF చాప్టర్ 2 కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన KGF చాప్టర్ 1 క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. మొదటి రోజు రివ్యూలు కూడా నెగిటివ్ గానే వచ్చినప్పటికీ ఫైనల్ గా రెండు రోజుల అనంతరం సినిమా ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. మాస్ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో ఒక్కసారిగా సినిమా రేంజ్ మారిపోయింది. అయితే సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసిపోయినప్పటికి ఒక విషయంలో మళ్ళీ రీ షూట్ చేయబోతున్నట్లు టాక్.

ఆలస్యం అయినప్పటికీ..
KGF 2 ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇండియా మొత్తంలో ట్రెండ్ అయ్యింది. యష్ అభిమానుల సంఖ్య కూడా మరింత ఎక్కువయ్యింది. సినిమా మార్కెట్ వాల్యూ కూడా ఒక్కసారిగా మారిపోయింది. చాలా వరకు నిర్మాతలు టెంప్ట్ అవ్వకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ సెట్ చేసుకున్నారు. ఆ కారణంగా ఆలస్యం చేసిన కొద్ది సినిమా బజ్ పెరగడంతో రేట్లు కూడా పెరిగాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ 400కోట్లకు పైగానే కొనసాగే అవకాశం ఉందట.

ఆ కారణంగా వాయిదా
ఇక ఓటీటీ ఆఫర్స్ కూడా చాలానే వచ్చినప్పటికీ కొంచెం కూడా ఆ విషయం గురించి ఆలోంచలేదు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను థియేటర్స్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారు. గత ఏడాది విడుదల కావాల్సిన KGF చాప్టర్ 2 కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫైనల్ గా సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు.

మరోసారి రీ షూట్
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. KGF 2 రీ షూట్స్ ప్లాన్స్ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అయితే మొత్తం పూర్తయ్యాయి. కానీ ఒక విషయంలో మాత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ అంతగా సంతృప్తి చెదలేదట. సినిమాకు ప్రస్తుతం పెరుగుతున్న బజ్ విషయంలో అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అందుకే రీ షూట్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రభాస్ సినిమాను పక్కన పెట్టి..
తాజా సమాచారం ఏమిటంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ యష్ ఇంట్రడక్షన్ సాంగ్ విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెదలేదని టాక్. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దర్శకుడు సలార్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులలో కూడా పాల్గొంటున్నాడు. సినిమాను ఫినిష్ చేసినా కూడా ఏదో ఒక ఎడిటింగ్ వర్క్ జరిగుతుందట. ఇక పాట వచ్చిన తీరు నచ్చకపోవడంతో రీ షూట్‌కి ప్లాన్ చేస్తున్నాడట. ఈ వార్త ఇంకా అఫీషియల్ గా రాకపోయినప్పటికి, అది వైరల్‌గా మారింది. అవసరం అయితే ప్రభాస్ సలార్ సినిమాకు కొంత గ్యాప్ ఇచ్చి ఆ పాటకు సంబంధించిన రీ షూట్ పనులను చూసుకోవాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయినట్లు టాక్.
Recommended Video

ఒక్కసారిగా రేంజ్ మారిపోవడంతో
హిందీలో కూడా KGF చాప్టర్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిగతా భాషల్లో అత్యధిక స్థాయిలో వసూళ్లను అందుకున్న మొదటి కన్నడ సినిమాగా KGF చాప్టర్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసింది.హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రేంజ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఇక సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తప్పకుండా సెకండ్ చాప్టర్ అంచనాలను మించి హిట్ అవుతుందని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











