Prashanth Neel: ఎన్టీఆర్, ప్రభాస్‌లకు హ్యాండ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... అంతా ఆ మెగా హీరో కోసమే!
కేజీఎఫ్, కేజీఎఫ్2 బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో కలిసి సలార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక అందరూ ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ప్రాజెక్టు సలార్ 2 శౌర్యంగ పర్వం అని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రశాంత్ నెక్ట్స్ ప్రాజెక్ట్ సలార్ 2 కాదని తెలుస్తోంది. అయితే ఏముంది.. ఎన్టీఆర్ మూవీ మొదలు పెడతాడు.. అనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్, ప్రభాస్ లకు హ్యాండ్ ఇచ్చి.. ఆయన మరో హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
అగ్ర హీరోలు, భారీ ప్రాజెక్టులతో ప్రశాంత్ నీల్ బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. యష్ తో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్.. ఒక్కసారిగా నెేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా తీశాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతే కాదు.. కలెక్షన్ల పరంగా ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది.

ఇక ఈ సినిమా ఎండింగ్ లో సలార్ 2 శౌర్యంగ పర్వం చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. అయితే ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. ప్రభాస్ తోనే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. సలార్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ కల్కి, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డిలాక్స్.. ఇవి పూర్తి కావాలి. ఇక ఆ తర్వాత సందీప్ వంగా డైరెక్షన్ లో స్పిరిట్.. ఇవన్నీ పూర్తి కావాలంటే చాలా టైం పడుతుంది.
మరి సలార్ 2 ఇప్పట్లో లేనట్లే కనిపిస్తుంది. మరి ఇక ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్.. ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తాడని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తి అయ్యాకే ప్రశాంత్ నీల్ సినిమా. అందుకే ప్రశాంత్ నీల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తన నెక్ట్ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉండబోతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమా తీయనున్నట్లు అది కూడా మల్టీ స్టారర్ తీయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రశాంత్ నీల్.. చిరంజీవిని, రామ్ చరణ్ ను కలిశారు కూడా. అప్పట్లో వారి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇప్పుడు వారి ప్రాజెక్టును పట్టాలెక్కించుందుకు మరోసారి చర్చలు జరుపుతున్నారట. రామ్ చరణ్‌తో చేసే సినిమాలో అందులో చిరంజీవి కూడా ఉంటారని టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టు గురించిన చర్చలు నడుస్తున్నాయని... కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.ఇక ఈ సినిమాకు ప్రోడ్యూసర్ మాత్రం హోంబలే బ్యానర్ కాకుండా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











