YSRCP ప్రచారంలో ఎన్టీఆర్ డైరక్టర్ బిజీ(ఫొటో)
హైదరాబాద్ : జగన్ కి, ఆయన కుటుంబానికి మొదనుంచీ సన్నిహితుడుగా ఉంటూ వచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన తాజాగా YSRCP ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన సోదరుడు గణేష్ వైజాగ్ రూరల్ నరసీపట్నం నియోజక వర్గం నుంచి నిలబడటంతో అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే పూరీ మరో సోదరుడు సాయిరామ్ శంకర్ సైతం ఇక్కడ ఎలక్షన్ క్యాంపైన్ లో పాల్గొన్నారు. పూరీ రోడ్ షోలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఫలానా పార్టీకి,ఫలానా గుర్తుకి ఓటేయమని అడగకుండా,తన సోదురుడుని మాత్రమే గెలిపించమని కోరటం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం పూరి జగన్నాథ్...స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్ ఈ కాంబినేషన్ కుదర్చడానికి ప్రయత్నించాడు. కానీ... వీలు కాలేదు. ఈ సారి మాత్రం ఎన్టీఆర్ - పూరి జత కట్టడం ఖాయంగానే కనిస్తోంది. ఈ చిత్రానికి సంభందించిన కథని ఇప్పటికే పూరీ ఓకే చేయించుకున్నట్లు సమాచారం.

అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.
మరో ప్రక్క తాజాగా ఆయన తన బ్యానర్ పై చేసే చిత్రానికి 'ఓవర్ యాక్షన్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ ఎప్పుడూ క్రేజీగా ఉంటే టైటిల్స్ తో ముందుకు వచ్చి ఆకట్టుకుంటూంటారు. ఈ చిత్రాన్ని ఆయన అశోశియేట్ డైరక్ట్ చేస్తారని, చాలా తక్కువ బడ్జెట్ లో తయారయ్యే కామెడీ చిత్రమని తెలుస్తోంది.
ఓ పాపులర్ కమిడయన్ ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాసం ఉంది. పూరి తన బ్యానర్ పూరీ టూరింగ్ టాకీస్ పై ఈ చిత్రం నిర్మిస్తారు. ఈ మేరకు రీసెంట్ గా కథ విన్న పూరి తన బ్యానర్ పైనే నిర్మిస్తానని ఆ దర్శకుడుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూరీ డైలాగులు రాసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంపై నిర్మించిన హార్ట్ ఎటాక్ చిత్రం విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











