ఇల్లు కొనుక్కుని ముంబైకి షిప్ట్ అవుతున్న తెలుగు దర్శకుడు
పూరీ జగన్నాధ్ దృష్ఠి అంతా ఇప్పుడు హింది పరిశ్రమపై ఉంది. అమితాబ్ తో చేసిన బుడ్డా హోగా తేరా బాప్ చిత్రం రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాపెట్ సంపాదించిందని స్వయంగా అమితాబ్ పొగుతూండటంతో పూరీకి ఎక్కడలేని ధైర్యము వచ్చింది.దాంతో పూరీ అక్కడే ఓ ఇల్లు కొనుగోలు చేసి మారే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో ప్రక్క అభిషేక్ బచ్చన్ కూడా నా తర్వాత సినిమా నువ్వే చేయాలని డేట్స్ ఇవ్వటంతో తనకు ఢోకా లేదని ఫిక్సయ్యాడు.
అంతేగాక తన గురువు రామ్ గోపాల్ వర్మ అక్కడే ఉండి హిందీ సినిమాలు తీస్తూ సెటిల్ అవ్వటంతో ఆయన అండ కూడా ఉంటుందనే ఆలోచనతో తెలుగు పరిశ్రమకు దాదాపు టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు చెప్పుతున్నారు. ఇక పూరీ తన తదుపరి ప్రాజెక్టుని మహేష్ తో ది బిజినెస్ మ్యాన్ ప్రకటించాక తెలుగులో ఏదీ ఒప్పుకోవటం లేదు. అందులోనూ వరసగా గోలీమార్,ఏక్ నిరంజన్, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, నేనూ నా రాక్షసి చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావటం కూడా ముంబైలో సెటిల్ అవ్వాలనుకోవటానికి ఓ కారణం అంటున్నారు.


Click it and Unblock the Notifications











