రాజమౌళి మరో మెగా సర్‌ప్రైజ్.. అగ్ర హీరోతో బిగ్ బడ్జెట్ మూవీ?
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎవరూ ఊహించని విధంగా అంతకు మించి అనేలా మల్టీస్టారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన RRR సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ బిగ్ బడ్జెట్ సినిమా అనంతరం రాజమౌళి మహేష్ బాబుతో మరొక పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. అయితే రాజమౌళి లిస్టులో మరికొంత మంది హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరొక హీరో పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబుతో ప్రాజెక్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించిన టువంటి RRR సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కు పెంచింది. రాజమౌళి స్టామినా ఏమిటో మరోసారి నిరూపితమైంది. ఇక రాజమౌళి ఆ తరువాత సినిమాను అంతకుమించి అనేల తెరకెక్కించాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. హీరోగా మహేష్ బాబు ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

తెలుగు హీరోలతోనే..
దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమాను తెరకెక్కించిన కూడా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉండాలి అని జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఇక పాన్ ఇండియా ఫార్మాట్ వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇక ఆయన పరభాష స్టార్ హీరోల వైపు పెద్దగా ఆసక్తి చూపకుండా ఎక్కువగా తెలుగు హీరోలతోనే బిగ్ బడ్జెట్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం.

ఫైనల్ కథ రెడీ అవ్వలేదు..
తదుపరి సినిమాను మహేష్ బాబుతో తెరకెక్కించనున్న రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా అంతకు మించి అనేలా డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్టు విషయంలో ప్రస్తుతం దర్శకుడు చాలా బిజీగా ఉన్నాడు. ముందుగానే కథ విషయంలో ఒక పాయింట్ అయితే అనుకున్నారట. కానీ రాజమౌళి ఇంకా ఫైనల్ కథను రెడీ చేసుకోలేదు అని తెలుస్తోంది.

ఆ కారణంగా..
ఇక రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత ఏ హీరోతో చేస్తారు అనే విషయంలో ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. సాధారణంగా రాజమౌళి ఒక సినిమా పూర్తయి రిలీజ్ అయిన తర్వాతనే మరొక సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాడు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా విడుదలకు ముందే మహేష్ బాబు తో ప్రాజెక్టు పై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

మెగాస్టార్ తో కూడా..
ఇక రాజమౌళి లిస్టులో మరికొంత మంది హీరోలు కూడా ఉన్నట్లు చాలా రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి తో కూడా సినిమా చేయాలనే కోరిక ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజమౌళి అఫీషియల్ గా ఆ విషయంలో అప్డేట్ ఇస్తాడు అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ కు కూడా జక్కన్నతో వర్క్ చేయాలని ఉన్నట్లు చాలాసార్లు చెప్పాడు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్టవుతుందో తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











