మహేశ్ బాబుకు టార్చర్ స్టార్ట్.. మూడు నెలల పాటు అలా చేయాలని జక్కన్న కండిషన్.. లేదంటే?
దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్త గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హీరో కంటే ఎక్కువ క్రేజ్ అయితే రాజమౌళికి ఉంటుంది. అయితే ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను మహేశ్ తో చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ సినిమా కోసం మహేశ్ బాబును రాజమౌళి టార్చర్ పెడుతున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే...
హాలీవుడ్ రేంజుకు...:దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వీరి నటకు హాలీవుడ్ సైతం ప్రశంసల జల్లులు కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి రేంజు హాలీవుడ్ స్థాయికి చేరింది.

పనులు ప్రారంభం: రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అంఛనాలు మొదలు అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కాగితాల మీద రెడీ అవుతున్నాయని సమాచారం. ఈ ఏడాది చివరిలోనైనా.. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు తీసుకువెళ్లాని జక్కన్న ప్లాన్. ఇక ఈ సినిమా హాలీవుడ్ రేంజులో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
మహేశ్ బాబుకు టార్చర్...:ఇక ఈ సినిమా కోసం రాజమౌళి మూడు నెలలపాటు మహేశ్ బాబును ఓ రేంజ్‌లో టార్చర్ పెట్టబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మూడు నెలల పాటు మహేశ్ కోసం ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇండియాలో ఉంటుందా ? విదేశాల్లో ఉంటుందా? అన్న క్లారిటీ లేదు కానీ.... ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంక్రాంతి టైం నుంచి ఇది స్టార్ట్ అవుతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ట్రైనింగ్ తీసుకోవాల్సిందే..: ఇక ట్రైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ మార్చకూడదని రాజమౌళి ఇప్పటికే మహేశ్ బాబుకు కండీషన్ కూడా పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేయాలని మహేశ్ ఫిక్స్ అయ్యాడట. అందుకోసం త్రివిక్రమ్ కూడా గుంటూరు కారం సినిమా కోసం ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారని సమాచారం.

భారీ అంచనాలు...:ఇక రాజమౌళి సినిమాకు ముందే ట్రైనింగ్‌లో పాల్గొంటే హీరో ఆ పాత్రలో ఒదిగిపోతాడన్నమాట. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ముందుగానే ట్రైనింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా రాజమౌళి అప్పుడే మహేష్ బాబుకు టార్చర్ స్టార్ట్ చేసినట్టే కనపడుతోంది. ఇక సినిమా మొదలు అయ్యాక ఎలా ఉంటుందో తెలియదు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











