SSMB29 కోసం రాజమౌళి సూపర్ స్కెచ్.. ఏకంగా నెట్ ఫ్లిక్స్ చీఫ్ తో డీల్.. 800 కోట్లతో!
దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమాతో ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు త్వరలో ఆస్కార్ అవార్డ్ కచ్చితంగా వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. జక్కన్న, మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా పడాలని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు.
ఎట్టకేలకు వీళ్లిద్దరి కాంబోలో ఓకే అయిన SSMB29 సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని అప్పుడే అంచనాలు పెరిగాయి. RRR సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి అప్పుడే SSMB29 కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

భారీగా ప్లానింగ్..
దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక వీరి కలయికలో మొట్టమొదటి సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందా అని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రాజమౌళి మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భారీగానే ప్లాన్ చేస్తున్నారు.

అలాంటి కథతో..
ప్రస్తుతం RRR సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న దర్శక దిగ్గజం రాజమౌళి మహేశ్ బాబు సినిమా కోసం దీర్ఘంగానే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు కథ అనుకున్న జక్కన్న ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నాడు. రాజమౌళి ఒక కథ రాసుకున్నాడు అంటే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే దాన్ని సెట్స్ పైకి తీసుకు వెళుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేశ్ 29వ సినిమా కోసం పవర్ ఫుల్ కథను అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాజమౌళి మాటలు వైరల్..
ఇంతకు ముందు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేశ్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది. అది కూడా ఇండియానా జోన్స్ వంటి యాక్షన్ అండ్వెంచరస్ సినిమాగా ఉండనుందని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. ఒక అడ్వంచర్ సినిమా చేయాలను చూస్తున్నట్లు, అలాంటి చిత్రాలంటే ఇష్టం అని ఆయన పేర్కొన్నారు.

అవేంజర్స్ విలన్...
ఇక రాజమౌళి SSMB29 కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థతో కూడా ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు ఇదివరకే మరొక క్లారిటీ వచ్చింది. ముందుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని అర్థమవుతోంది. అలాగే మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాలో అనేక మంది హాలీవుడ్ స్టార్స్ నటించనున్నారని టాక్ అయితే వినిపించింది. విలన్ కోసం అవేంజర్స్ విలన్ ను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి.

ముంబైలో సమావేశం..
అంతేకాకుండా మహేశ్ బాబు సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ కార్తీని కూడా తీసుకుంటున్నారని ఒక ప్రచారం జరిగింది. అందుకోసం ఆయన బాడీలో మార్పులు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే జక్కన్న తాజాగా దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చీఫ్ టెడ్ సరండోస్ ను కలిశారు. ఇండియా పర్యటనలో ఉన్న ఆయనను ముంబైలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన SSMB29 సినిమాపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

అన్ని వెర్షన్లు.. 800 కోట్లు..
SSMB29 సినిమాకు సంబంధించిన అన్ని భాషా వెర్షన్లను కొనుగోలు చేయాలని నెట్ ఫ్లిక్స్ చీఫ్ ని రాజమౌళి కోరారట. అందుకోసం నెట్ ఫ్లిక్స్ చీఫ్ సైతం ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. లేదా నెట్ ఫ్లిక్స్ కూడా కొన్ని చిత్రాలను నిర్మిస్తుంటుంది. ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించాలని జక్కన్న కోరి ఉండొచ్చని మరో టాక్ వినిపిస్తుంది.
అంటే ముందుగానే మహేశ్ బాబు సినిమా కోసం జక్కన్న భారీగా ప్లాన్స్ వేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను రూ. 800 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











