RRR బిజినెస్ కోసం రాజమౌళి కొత్త టార్గెట్.. అభిమానులు ఓపిక పట్టాల్సిందే?
దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా స్టార్ట్ చేశారు అంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంతగా కష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మినిమమ్ బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ఆలస్యంగా తెరకెక్కించినా మంచి సినిమానే రెడీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఒకే ఒక్క సినిమాతో తన క్రేజ్ ని పెంచుకున్న జక్కన్న ప్రస్తుతం RRR సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
Recommended Video

బిగ్గెస్ట్ మల్టీస్టారర్..
సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల వారికి టాలీవుడ్ సత్తా ఏమిటో అర్థమైపోయింది. కన్నడ , మలయాళంలో ఈపాటికే మన హీరోలు వారికంటూ ఒక స్పెషల్ మార్కెట్ ని సెట్ చేసుకోగా తమిళ్ లో మాత్రం సినిమా స్థాయిని బట్టి క్రేజ్ అందుకుంటున్నారు. కోలీవుడ్ ఆడియెన్స్ మాత్రం రాజమౌళి సినిమా అంటే తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. RRRకూడా అక్కడ భారీగా రిలీజ్ కానుంది.

RRR వాయిదా..
దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమా అనుకున్న సమయానికి వస్తుందని ఓ వర్గం ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అసలైతే ఈ ఏడాది సమ్మర్ ఎండింగ్ లో రావాల్సిన RRR అనుకోని కారణాల వల్ల 2021 జనవరికి షిఫ్ట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోవడం లేదని రాజమౌళి సంక్రాంతికి షిఫ్ట్ చేశాడు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ అయిపోలేదని మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరో సమ్మర్..
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులను మరొక బ్యాడ్ న్యూస్ కలవరపెట్టే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే RRR సినిమా పనులు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఓకేవేళ నవంబర్ వరకు పూర్తి చేసినా కూడా జనాలు థియేటర్స్ వరకు వస్తారా అనేది అనుమనంగానే ఉంది. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికి జనాల్లో సోషల్ డిస్టెన్స్ ఎక్కువయ్యే అవకాశం లేకపోలేదు. అందుకే జనాలు వైరస్ ని మర్చిపోయేంత వరకు రిలీజ్ చేయకూడదని.. 2021 సమ్మర్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.

బిజినెస్ దెబ్బతినకూడదని..
RRR సినిమా ఎలాగైనా సక్సెస్ కావాలని దర్శకుడు రాజమౌళి తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు. సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ వస్తేనే నిజమైన సక్సెస్. అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా దేశవ్యాప్తంగా సినిమా మంచి బిజినెస్ చేయాలని కాస్త అలస్యమయినా పరావలేదని రిలీజ్ డేట్ ని వాయిదా వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











