రెండు పార్టులుగా SSMB29.. చిత్రీకరణకు అన్ని సంవత్సరాలు! గ్లోబల్ స్టార్ గా మహేశ్ బాబు?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. జక్కన్న, టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కలయికలో సినిమా రావాలని గత పుష్కరకాలం నుంచి అభిమానులు, ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
వీరిద్దరి కాంబోలో SSMB29గా సినిమా రానున్నట్లు ప్రకటించినప్పటి నుంచి మూవీపై క్యూరియాసిటీ పెరుగుతూ వస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఏ జోనర్ లో తెరకెక్కించనున్నారని పలు రకాలుగా టాక్ నడిచింది. అయితే తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.

జక్కన్న దర్శకత్వంలో..
సుధీర్ఘకాలంగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడ సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమాలు హిట్టయిన, ఫట్టు అయిన సంబంధం లేకుండా వరుస పెట్టి చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటు దర్శక ధీరుడు రాజమౌలి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

పవర్ ఫుల్ కథతో..
ప్రస్తుతం RRRకు అవార్డుల పంట కొనసాగుతోంది. ఈ సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న దర్శక దిగ్గజం రాజమౌళి అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే మహేశ్ బాబు సినిమా కోసం ఆయన పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. రాజమౌళి ఒక కథ రాసుకున్నాడు అంటే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే దాన్ని సెట్స్ పైకి తీసుకు వెళుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేశ్ 29వ సినిమా కోసం పవర్ ఫుల్ కథను అయితే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాజమౌళి మాటలు..
ఇంతకు ముందు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేశ్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది. దానికి తగినట్లుగానే ఇండియానా జోన్స్ వంటి యాక్షన్ అండ్వెంచరస్ సినిమాగా ఉండనుందని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన మాటలు ఉన్నాయి. ఒక అడ్వంచర్ సినిమా చేయాలను చూస్తున్నట్లు, అలాంటి చిత్రాలంటే ఇష్టం అని ఆయన పేర్కొన్నారు.

నెట్ ఫ్లిక్స్ తో డీల్..
ఇక రాజమౌళి SSMB29 కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థతో కూడా ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు ఇదివరకే మరొక క్లారిటీ వచ్చింది. ముందుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని అర్థమవుతోంది. ఇందులో అవేంజర్స్ విలన్ తో పాటు కార్తీ కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ తో రాజమౌళి భారీ డీల్ ను కుదుర్చుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త గింగిరాలు తిరుగుతోంది.

రెండు పార్టులుగా..
బాహుబలి కథను ది బిగినింగ్, ది కంక్లూజన్ అంటూ రెండు పార్టులుగా తీసినట్లుగానే SSMB29ను కూడా రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక ధీరుడు ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బాహుబలి 1, 2 చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాయి. ఇక RRR గ్లోబల్ ఆడియెన్స్ ప్రశంసలు అందుకుంటోంది. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్ పెరిగింది. దీంతో గ్లోబల్ స్థాయిలో అందరినీ ఆకట్టుకునే విధంగా పెద్ద చిత్రాన్ని అందించాలని జక్కన్న అనుకుంటున్నారట.

గ్లోబల్ స్టార్ గా మహేశ్ బాబు..
మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 కథను రెండు భాగాలుగా లేదా సీక్వెల్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంర్వ్యూలో సీక్వెల్స్ ఉంటాయని, వీటిల్లో కథ మారుతుందని, ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇందుకోసం మహేశ్ బాబు 4 ఏళ్లు ఈ ప్రాంఛైజీ చిత్రానికే పరిమితం కానున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు కూడా నాలుగేళ్ల సమయం కేటాయించేందుకు రెడీగా ఉన్నట్లు టాక్. దీంతో మహేశ్ బాబు కూడా గ్లోబర్ స్టార్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











