SSMB29లో మహేశ్ బాబుకు జోడీగా హాలీవుడ్ హీరోయిన్.. షూటింగ్ ఎప్పుడంటే?

దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమాతో ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో రాజమౌళి తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జక్కన్న తన తర్వాతి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా పడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకున్నారు. అది RRR తర్వాత నెరవేరనుంది. అయితే భారీ అంచనాలు ఉన్న SSMB29 చిత్రాన్ని అంతే స్థాయిలో తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఓ హాలీవుడ్ ముద్దుగుమ్మను రంగంలోకి దించనున్నట్లు టాక్.

సినిమాపై క్యూరియాసిటీ..

సినిమాపై క్యూరియాసిటీ..


సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. జక్కన్న, టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కలయికలో సినిమా రావాలని గత పుష్కరకాలం నుంచి అభిమానులు, ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో SSMB29గా సినిమా రానున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతూ వస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఏ జోనర్ లో తెరకెక్కించనున్నారని పలు రకాలుగా టాక్ నడిచింది.

అమెజాన్ అడవుల్లో..

అమెజాన్ అడవుల్లో..

ఇటీవలే RRRకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ అవార్డ్ వరించింది. ఈ విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న దర్శక దిగ్గజం రాజమౌళి SSMB29 కోసం ఆయన పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. ఇంతకు ముందు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేశ్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది.

RRR ఎఫెక్ట్..

RRR ఎఫెక్ట్..

విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగానే ఇండియానా జోన్స్ వంటి యాక్షన్ అండ్వెంచరస్ సినిమాగా ఉండనుందని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి SSMB29 కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థతో కూడా ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు ఇదివరకే మరొక క్లారిటీ వచ్చింది. ముందుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని అర్థమవుతోంది. అందుకు కారణం RRR ఎఫెక్ట్ అని తెలుస్తోంది.

 రెండు భాగాలుగా..

రెండు భాగాలుగా..

రాజమౌళి RRR సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డ్ సైతం వచ్చింది. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్ పెరిగింది. గ్లోబల్ స్థాయిలో అందరినీ ఆకట్టుకునే విధంగా పెద్ద చిత్రాన్ని అందించాలని జక్కన్న అనుకుంటున్నారట. అందుకోసం SSMB29 కథను రెండు భాగాలుగా లేదా సీక్వెల్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంర్వ్యూలో సీక్వెల్స్ ఉంటాయని, వీటిల్లో కథ మారుతుందని, ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి.

 హాలీవుడ్ నటీనటులు..

హాలీవుడ్ నటీనటులు..

ఇక ఇప్పుడు రాజమౌళి సినిమాలు RRR వరకు ఒక ఎత్తు అయితే.. SSMB29 నుంచి మరో ఎత్తు కానున్నాయి. అందుకే ఈసారి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజెస్ తోపాటు టెక్నీషియన్స్ తోనూ జక్కన్న చేతులు కలుపుతున్నారట. ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో భాగం అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను సినిమాలో నటించేందుకు ఒప్పిస్తుంది.

పూజా కార్యక్రమాలు..

పూజా కార్యక్రమాలు..


ఇది వరకే అవేంజర్ విలన్, థోర్ హీరో క్రిస్ హేమ్స్ వర్త్ SSMB29 నటిస్తారని టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా హాలీవుడ్ నటిని రంగంలోకి దించనున్నారట జక్కన్న. అయితే ఆమె ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అంతేకాకుండా ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో గ్లోబల్ రేంజ్ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలను చేసి.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో SSMB29ను తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X