రాజమౌళి చెప్పకముందే అలియా తప్పుకుందా.. RRR కోసం మరో బాలీవుడ్ బ్యూటీ?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎలా మరణించాడు అనే మిస్టరీ తెలిసే వరకు బాలీవుడ్ సెలబ్రెటీస్ నిద్రపట్టేలా లేదు. నెపోటీజమ్ రాకాసి దెబ్బకు స్టార్స్ ఫ్యామిలీ సబ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ వివాదంలో అలియా భట్ పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఆమెకు సంబంధించిన ఎలాంటి విషయం బయటకు వచ్చిన కూడా ట్రోలింగ్ తో ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.

అలియాపై ఒక క్లారిటీ వచ్చేసింది
ఇటీవల విడుదలైన సడక్ 2 ట్రైలర్ తోనే అలియా క్రేజ్ ఏ స్థాయికి పడిపోయిందో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. భవిష్యత్తులో కూడా అది కంటిన్యూ అయ్యే అవకాశం లేకపోలేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్న దర్శక నిర్మాతలకు కూడా ఒక భారంగా మారినట్లు అర్ధమవుతోంది.

ఆలోచనలో పడ్డ రాజమౌళి
ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా RRRలో అలియా భట్ రామ్ చరణ్ కి జోడిగా నటించనున్న విషయం తెలిసిందే. అయితే నెపోటిజమ్ కారణంగా ఆమెను తప్పించే ఆలోచనలో ఉన్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి, నిర్మాత దానయ్య తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్
అయితే పరిస్థితిని అర్థం చేసుకున్న అలియా చిత్ర యూనిట్ వెళ్ళిపొమ్మనక ముందే సినిమా నుంచి తప్పుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఇక ఆమె స్థానంలో మరొక బాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకునెందుకు రాజమౌళి ప్లాన్ చేస్తిన్నట్లు టాక్. ఆ లిస్ట్ లో ప్రియాంక చోప్రా ఉన్నట్లు సమాచారం.
Recommended Video

గతంలోనే రామ్ చరణ్ కి జోడిగా..
హాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా గతంలో రామ్ చరణ్ కి బొడిగా జంజీర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాలీవుడ్ లో భారీగా రిలీజ్ అయినప్పటికీ ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు RRR లో మరోసారి ఆ బ్యూటీనే సెలెక్ట్ చేసుకోవాలని రాజమౌళి చర్చలు జరుపుతున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే షూటింగ్ మొదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











