SSMB29 సూపర్ అప్డేట్.. మరో హీరోతో మహేశ్ మల్టీస్టారర్.. అది కూడా రెండు పార్టులుగా!
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాను రెండు పార్టులుగా తీయనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
సూపర్ క్రేజ్..: దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బహుబలి సిరీస్ తర్వాత చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ వరల్డ్ గుర్తింపును తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కింది. దాదాపు 1200కోట్లకు పైగా వసూలు చేసి.. ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది ఆర్ఆర్ఆర్. ఇక హాలీవుడ్ వేదికపై తెలుగోడి సత్తా ఏంటో నిరూపించాడు రాజమౌళి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం.. భారతీయులకు గర్వకారణం.

మహేశ్ కసరత్తులు..: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నెక్ట్స్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ అయితే కలిగింది. ఆయన ఎలాంటి సినిమా చేయనున్నారో.. ఎవరితో చేస్తారో అనే సమయంలో... రాజమౌళి మహేశ్ మూవీ ప్రకటించారు. దీంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇప్పటికే మహేశ్.. తన బాడీ బిల్డప్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదంతా రాజమౌళి సినిమా కోసమేనని ప్రచారం అయితే జరుగుతుంది.

ఇంట్రెస్టింగ్ న్యూస్..: ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్టేట్ బయటకు వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రానుందని సమాచారం. అంతే కాదు.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తారని తెలుస్తోంది. అందులో ఒకరు మహేశ్ కాగా.. మరో హీరో బాలీవుడ్ నటుడని టాక్.

రెండు పార్ట్స్...: రెండు పార్టులుగా రాబోతున్న ఈ సినిమలో మొదటి పార్టులో మహేశ్ హీరోగా ఉంటారని... రెండో పార్ట్ లో మరో స్టార్ హీరో నటిస్తారని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మొత్తానికి జక్కన్న ఈ సినిమాని కూడా మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మహేశ్ బర్త్ డే ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని సమాచారం. ఆ రోజున ఈ సినిమా నుంచి అప్డేట్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

ఇక మహేశ్ విషయానికి వస్తే..: త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. నవంబర్ లోపు త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాతే రాజమౌళి మహేశ్ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ కోసం స్క్రిప్ట్ పనులపై ఉన్నారట. ఇక మహేశ్ కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











