ప్రభాస్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ.. మలుపు తిప్పేలా సీన్లు.. ఎలాంటి పాత్ర అంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డార్లింగ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్య విడుదలైన ప్రభాస్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. దీంతో తర్వాతి సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక అంచనాలు క్రియేట్ అయిన ఆదిపురుష్ పై అంతగా నమ్మకం పెట్టుకోని ఫ్యాన్స్ ఒక మంచి హిట్టు మూవీ పడితే బాగుండు అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ నటిస్తున్న ఓ సినిమాలో సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నట్లు సమాచారం.

తీవ్ర నిరాశకు..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక తర్వాత వచ్చే సినిమాపై ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. అలా ఆదిపురుష్ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్. కానీ ఆదిపురుష్ టీజర్ చూశాకా వారి ఆశలు గల్లంతు అయ్యాయి. దానిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. తర్వాత దాన్ని కవర్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నించిన వర్కౌట్ కాలేదు.

ఏకంగా 6 సినిమాలు..
ఇటీవలే శ్రీ రామ నవమి సందర్భంగా ఆదిపురుష్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ అభిమానుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అయితే డార్లింగ్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో పాటు మరో ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మారుతితో హారర్ కామెడీ చిత్రంగా 'రాజా డీలక్స్', పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది.

ప్రాజెక్ట్ కె వాయిదా..
ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరి ఆశలన్నీ ప్రశాంత్ నీల్ డైరెక్టెడ్ మూవీ సలార్ పైనే ఉన్నాయి. ఈ సినిమా మాత్రం హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. కానీ దీనికంటే ముందుగా జనవరిలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ప్రాజెక్ట్ కె సినిమా కచ్చితంగా వస్తుందా రాదా అనే అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఒకవేళ ప్రాజెక్ట్ కె విడుదల తేది వాయిదా పడి, రిలీజ్ ఆలస్యం అయితే మాత్రం ఆ స్థానాన్ని మారుతీ దర్శకత్వంలో వస్తున్న సినిమా తీసుకోనుంది.

సినిమాలో ఆర్జీవీ ఎంట్రీ..
మారుతి దర్శకత్వంలో వస్తున్న ప్రభాస్ సినిమా హరర్ కామెడీ జోనర్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశోధనలో ఉంది. ఈ మూవీ షూటింగ్ గత నాలుగైదు నెలలుగా జరుగుతోంది. అప్పుడప్పుడు పలు లీక్ లు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నటిస్తారని సినీ ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వస్తున్నాయి.

టెర్రస్ సెట్ లో.. కీలకంగా..
ప్రభాస్ రాజా డీలక్స్ మూవీలో రామ్ గోపాల్ వర్మ ఒక చిన్న కెమీయో చేస్తారని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఒక టెర్రస్ సెట్ లో కీలక ఆర్టిస్టులతో పాటు ఆర్జీవీ పాల్గొన్న ఒక ఎపిసోడ్ ను మారుతీ ఆల్రెడీ చిత్రీకరించారట. అయితే సినిమాను మలుపు తిప్పే ఆ కీలక సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో రాకపోవడంతో వాటిని ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఉంచాలో.. లేదో పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

అలాంటి పాత్ర.. అదిరిపోతే తప్పా..
అయితే అదే పనిగా రామ్ గోపాల్ వర్మతో షూటింగ్ చేసేంతగా ఆయన క్యారెక్టర్ ను మారుతు ఏం డిజైన్ చేసుంటారని అభిమానుల్లో డౌట్ కలుగుతోంది. ఇంతకుముందు హరర్ చిత్రాల్లో పేరు గాంచిన ఆర్జీవీ ఈ సినిమాలో సైకియాట్రిస్ట్, మెంటలిస్ట్ (రాజుగారి గది 2లో నాగార్జున వంటి పాత్ర) వంటి రోల్ పోషించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఆయన పాత్రను ఎక్స్ ట్రాడినరీగా చిత్రీకరిస్తే తప్పా పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చనే మరో సందేహం అభిమానుల్లో కలుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











