తరుముకొస్తున్న పోలీసులు .. ఆర్జీవీకి టాలీవుడ్ బడా హీరో ఇంట్లో షెల్టర్?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన దర్శకత్వంలో కొద్దిరోజుల క్రితం వచ్చిన వ్యూహం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టులు పెట్టినట్లుగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో టీడీపీ నేత ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా రామ్ గోపాల్ వర్మను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఒంగోలు పోలీసులు.. తమ ఎదుట విచారణకు హాజరవ్వాల్సిందిగా పలుమార్లు వర్మకు నోటీసులు పంపారు. కానీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. టీడీపీ అగ్రనేతలను వర్మ కించపరచడం వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లపై సోషల్ మీడియాలో ట్వీట్లు చేసినందుకు వర్మకు పెద్ద మొత్తంలో నగదు ముట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి.

director ram gopal varma hiding by tollywood star hero s farm house

రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం ఎలాంటి పని చేయలేదని.. కానీ ఆయనకు రూ. కోటి 14 లక్షల మొత్తం ఎలా చేరిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వర్మకు చెందిన ఆర్జీవీ ఆర్వీ గ్రూప్‌కు ఈ చెక్కులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. మరోవైపు.. రెండుసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ ఖాయమని గ్రహించిన రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కోసం ఏపీ, తెలంగాణ , తమిళనాడులలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తొలుత ఆర్జీవీ తమిళనాడులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. తర్వాత హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసాన్ని ఒంగోలు పోలీసులు చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి నేరుగా రావడంపై ఆయన తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తమకు కొంత గడువు కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా హాజరుకావడానికి సాధ్యం కానీ పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాలని వర్మ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉండగా.. వర్మ అరెస్ట్‌కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లగా.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్జీవీ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ కోసం షాద్ నగర్, శంషాబాద్ ఏరియాలలో రెండు పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వర్మకు షెల్టర్ కల్పించిన ఆ స్టార్ హీరో ఎవరు? అంతగా ఆర్జీవీని రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X