RGV: స్ట్రిప్ క్లబ్బులో వర్మ... ఒంటిపై నూలు పోగు కూడా లేని అమ్మాయిలతో రచ్చ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు అనేక ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేశాడు. కానీ ఇప్పుడు ఎక్కువగా వివాదాలతోని కాలం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం నాటా సభల రీత్యా అమెరికా వెళ్లిన రామ్ గోపాల్ వర్మ.. అక్కడ స్ట్రిప్ క్లబ్బుల్లో మెరుస్తూ.. నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే....

ట్రెండ్ సెట్ సినిమాలతో...: బీటెక్ పూర్తి చేసి హైదరాబాదులో వీడియో పార్లర్ నడుపుకుంటూ సినిమాల మీద ఆసక్తి పెంచుకున్న రాంగోపాల్ వర్మ... శివ సినిమాతో డైరెక్టర్ గా మారి ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించాడు. అప్పటివరకు శివ లాంటి సినిమాని తెలుగులో చూసి ఉండని ప్రేక్షకులు రాంగోపాల్ వర్మను నెత్తిన పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఆయన క్షణక్షణం, రంగీలా వంటి సినిమాలు చేసి అప్పటి యూత్ లో మంచి క్రైస్తవ సంపాదించడమే కాదు.
సోషల్ మీడియాలో హల్చల్:ఏకంగా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అమితాబ్ బచ్చన్ లాంటి హీరోతో సర్కార్ లాంటి సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే గత కొన్నాళ్ల నుంచి కంటెంట్ పరంగా సరైన సినిమాలు వర్మ నుంచి రావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక వివాదాలతో కాలం గడుపుతూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాలం గడుపుతూ వస్తున్న వర్మ ప్రస్తుతం కొన్ని పార్టీలకు తొత్తుగా మారి ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
అమ్మాయిలతో రచ్చ..:ప్రస్తుతానికి ఆ యాంగిల్ పక్కన పెడితే ఆయన అమెరికాలో జరుగుతున్న నార్త్ అమెరికా తెలుగు సభలకు హాజరయ్యాడు. ఇక అక్కడికి వెళ్లిన వర్మ అక్కడ కూడా తన పైత్యాన్ని చూపించడమే కాదు. పలు ఆసక్తికరమైన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయితో బికినీలో ఉండగా ఆమెను పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వర్మ ఇప్పుడు అమెరికాలో ఫేమస్ అయిన స్ట్రిప్ క్లబ్లో నగ్నంగా ఉన్న యూతుల ఫోటోలు దగ్గర ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
స్ట్రిప్ క్లబ్బులు అంటే...:మన దగ్గర స్ట్రిప్ క్లబ్బులు నిషిద్ధం కానీ... అమెరికాలో చాలా ప్రాంతాలలో ఈ స్ట్రిప్ క్లబ్లు ప్రభుత్వం అనుమతితోనే నడుస్తూ ఉంటాయి. ఈ స్ట్రిప్ క్లబ్బులలో యువతులు ముందుగా నిండుగా బట్టలు ధరించి ఉంటారు. కానీ ఆయా క్లబ్బులలో పెట్టిన పాటలకు అనుగుణంగా ఒక్కొక్క వస్త్రాన్ని తొలగిస్తూ చివరికి పూర్తిగా నగ్నంగా మారుతారు అన్నమాట.
వర్మ నిజంగా రాజేరా...:అలాంటి చోటకు వెళ్ళిన వర్మ అక్కడ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని అర్థం వచ్చేలా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఆయన అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వర్మ నిజంగా రాజేరా ఎక్కడున్నా అని కొందరు కామెంట్లు చేస్తుంటే... నీ పైత్యంతో ఇక్కడి యువతరాన్ని ఎందుకు చెడగొడుతున్నామని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.


Click it and Unblock the Notifications











