రూ.800 జీతంతో లవ్ మ్యారేజ్ చేసుకున్న వర్మ.. ఆమెను ఎందుకు వదిలేశాడంటే?
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా సినిమాలు తీసేవాడు. ఇప్పుడు నా ఇష్టం అంటూ... ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తూ... నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అంతే కాదు.. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉంటాడు. అయితే రామ్ గోపాల్ వర్మ మొదటి జీతం ఎంత.. ఆ జీతంతో లవ్ మ్యారేజ్ చేసుకున్న వర్మ.. ఎందుకు వాళ్లు విడిపోయారు.. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రామ్ గోపాల్ వర్మ.. ట్వీట్ చేసినా.. మాట్లాడినా.. ఏం చేసినా అది వివాదమే. అందుకే వర్మను వివాదాస్పద దర్శకుడు అంటూ ఉంటారు. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలను ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చిన వర్మ... ఆ తర్వాత సినిమాలు తెరకెక్కించడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. మొదట నాగార్జునతో శివ సినిమా తెరకెక్కించి... రికార్డ్స్ బ్రేక్ చేసినా వర్మ... ఆ తర్వాత బాలీవుడ్ లోనూ సంచలన సినిమాలు తీశాడు. ఆ తర్వాత ఫ్లాపులు వచ్చాయి.. అక్కడితో వర్మ గ్రాఫ్ పడిపోయింది.

ప్రస్తుతం వర్మ సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్ లు తెరకెక్కిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాల్లో క్రేజ్ తగ్గినా.. ఆయన ఇంటర్వ్యూలకు మాత్రం ఇప్పటికీ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక ఇంటర్వ్యూలో తన మాటలతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటాడు. వర్మను తిట్టుకునే వాళ్లు ఉంటారు. ఫ్యాన్స్ ఉంటారు. ఇదిలా ఉంటే వర్మకు ఓ భార్య, పాప కూడా ఉంది. అయితే ఆయనకు దూరంగా ఉంటున్నారు.
అయితే రామ్ గోపాల్ వర్మ కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ కు స్టోరీలు చెప్పేవాడట. అవి విన్న ఫ్రెండ్స్.. మాకు డబ్బుంటే.. నీతో సినిమా తీస్తానని చెప్పడంతోనే ఆయనకు కథలపైన శ్రద్ధ కలిగిందట. అలా చదువు పూర్తయ్యాక హోటల్ తాజ్ లో 800 రూపాయల జీతానికి పనికి కుదిరాడని సమాచారం. ఆ తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతమంది నిర్మాతలను కలిసి కథలు చెప్పినా.. అనుభవంతో రా అని సలహా ఇచ్చాడట. అలా శివ సినిమాతో దర్శకుడిగా మారాడు.
అయితే దర్శకుడిగా మారిన తర్వాత సినిమాల పిచ్చితో ఇంటికి సరిగ్గా వెళ్లేవాడు కాదట. మందు బాగా అలవాడు అయి... ఇంటికి వెళ్లినా కూడా భార్యను పట్టించుకోకుండా ఉండేవాడని సమాచారం. కొంతకాలం ఆమె చూసి చూసి ఓ రోజు నిలదీసిందని సమాచారం. అయితే ఏం అడిగినా కూడా రాంగోపాల్ వర్మ నోటితో సమాధానం చెప్పకుండా సైలెంట్ గా జారుకునేవాడట. ఎంత చెప్పినా కూడా రాంగోపాల్ వర్మ ఆమె మాట వినకపోవడం వలన ఆమె భరించలేక విడాకులు ఇచ్చేసిందంట. కూతుర్ని తీసుకొని ఆమె వెళ్ళిపోయిందట. అలా రామ గోపాల్ వర్మ జీవితంలోంచి ఆయన భార్య వెళ్ళిపోవడం జరిగింది.


Click it and Unblock the Notifications











