Balakrishna: 'హిట్ 4'లో బాలకృష్ణ.. ఆ డేట్ కోసం డైరెక్టర్ వెయిటింగ్.. శైలేష్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్!
ఇటీవల కాలంలో తెలుగు చిత్రసీమలో కూడా సినిమాటిక్ యూనివర్స్ మ్యాటర్ ఎక్కువైంది. హిట్ సినిమాల ఫ్రాంచైజీతో సూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర శైలేష్ కొలను. హిట్ యూనివర్స్ పేరుతో వివిధ సినిమాలు తెరకెక్కిస్తానని శైలేష్ ఇదివరకు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ యూనివర్స్ లో విశ్వక్ సేన్ తో హిట్ 1, అడవి శేష్ తో హిట్ 2 మూవీస్ వచ్చాయి. హిట్ 3 రాకముందే హిట్ 4లో హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ ఒక్క డేట్ కోసం డైరెక్టర్ శైలేష్ కొలను ఎంతగానో ఎదురుచూస్తున్నారట.

అనిల్ రావిపూడితో: నందమూరి నటసింహం బాలకృష్ణ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రూ. 200 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి, కామెడీ యాక్షన్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడిలతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

భగవత్ కేసరి: నందమూరి నటిసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న 108వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఉన్న ఈ సినిమాకు భగవత్ కేసరి అనే పేరు ఫైనల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ టైటిల్ ను బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయనున్నారని వినికిడి.

రకరకాల హీరోలతో: ఇదిలా ఉంటే హిట్: ది ఫస్ట్ కేస్ మూవీతో శైలేష్ కొలను డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. డాక్టర్ అయిన శైలేష్ ఈ సినిమాతో మంచి డెబ్యూ ఇచ్చారు. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమా సక్సెస్ తో హిట్: ది సెకండ్ కేస్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే రకరకాల హీరోలతో వరుసగా హిట్ ఫ్రాంచైజీ తీసుకురానున్నట్లు శైలేష్ తెలిపాడు.

సెట్స్ పైకి వెళ్లకముందే: ఇక హిట్ ఫ్రాంచైజీలో రాబోతున్న మూడో సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్నారు. హిట్ 2లోనే అర్జున్ సర్కార్ పాత్రగా పరిచయం కూడా చేసేశారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో శైలేష్ సైంధవ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత హిట్ 3 సెట్స్ పైకి తీసుకెళ్తారు. అయితే ఆ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి ముందే హిట్ 4తో మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేశాడట శైలేష్ కొలను.

ఆ డేట్ కోసం: హిట్ 4లో నందమూరి బాలకృష్ణ హీరోగా అనుకుంటున్నారట. ఇప్పటికే స్టోరీ చెప్పగా ఆయనకు కూడా కథ నచ్చిందట. కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం రాలేదని టాక్. ఒకవేళ బాలకృష్ణ ఒప్పుకుంటే ఈ విషయాన్ని కూడా బాలయ్య పుట్టిన రోజు అయిన జూన్ 10న అధికారిక ప్రకటన ఇస్తారని అంటున్నారు. అందుకే డైరెక్టర్ శైలేష్ జూన్ 10 డేట్ కోసం ఎదురుచూస్తున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











