మెగాస్టార్ కోసం ఇష్టమైన టైటిల్ ను వదిలేసిన దర్శకుడు
మెగాస్టార్ చిరంజీవి పక్క మాస్ కమర్షియల్ సినిమా చేయగలిగితే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలో కాస్త ఎమోషనల్ మెసేజ్ కంటెంట్ ఉన్నా కూడా హిట్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం మెగాస్టార్ లైనప్ కథలు మొత్తం కూడా అదే తరహాలో తెరకెక్కుతున్నాయి. మొదట ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ మెగా మల్టీ స్టారర్ పై నెవర్ బిఫోర్ అనేలా అభిమానుల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
తప్పకుండా సినిమా సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తుందని ఊహించవచ్చు. ఇక ఆచార్య అనంతరం కూడా మెగాస్టార్ సందేశాత్మక సినిమాలు పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు కేవలం మెసేజ్ మాత్రమే కాకుండా అందులో కమర్షియల్ గా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మలయాళం హిట్ మూవీ లూసిఫర్ ను డైరెక్టర్ మోహన్ రాజా చిరు 153 సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఒరిజినల్ కథకంటే కాస్త కొత్తగా రాబోతున్న ఈ సినిమా కోసం టైటిల్ గా కింగ్ మేకర్ అని అనుకున్నారు. మొదట కింగ్ మేకర్ ఆ తరువాత గాడ్ ఫాదర్ అనే మరొక టైటిల్ అనుకున్నారు. రెండిటిలో ఏది బెటర్ అనే విషయంలో సభ్యులందరూ ఆలోచించి గాడ్ ఫాదర్ కి ఓటు ఓటు వహేశారు.

అయితే ఆ టైటిల్ ని ఇది వరకే ఒక దర్శకుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ టైటిల్ కోసమే చిత్ర యూనిట్ సభ్యులు దర్శకుడిని స్పెషల్ గా కలవడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రముఖ దర్శకుడు మరెవరో కాదు కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది. ఈ దర్శకుడు రామ్ చరణ్ రచ్చ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి సినిమాలను కూడా తెరకెక్కించాడు. ప్రస్తుతం గోపీచంద్ తో చేసిన సిటిమార్ విడుదలకు సిద్ధంగా ఉంది.
అయితే భవిష్యత్తు ప్రాజెక్ట్ కోసమని సంపత్ నంది ముందుగానే గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను బుక్ చేసుకున్నాడు. ఇక ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కోసం అదే టైటిల్ అవసరం కావడంతో సంపత్ నంది ఇష్టపూర్వకంగానే ఆ టైటిల్ ను త్యాగం చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అంటే చిన్న తనం నుంచి అభిమానించడం వల్లనే సంపత్ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాడట. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆ ప్రాజెక్టును వీలైనంత తొందరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నారు. ఆ తరువాత జైలవకుశ, వెంకీ మామ దర్శకుడు బాబి తో ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం షాడో శక్తి సినిమాల దర్శకుడు మెహర్ రమేష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఒకవిధంగా ఇదే ఏడాదిలో ఈ మూడు సినిమాలను సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేయాలని అనుకుంటున్నారు. మరి. ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











