Don't Miss!
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
అఖిల్ తండ్రిగా మారబోతున్న ప్రముఖ దర్శకుడు
అక్కినేని అఖిల్‌కు కాలం కలిసి రావడం లేదు. ఏడాది వయసులోనే 'సిసింద్రీ' సినిమాతో మెప్పించిన అతడు.. హీరోగా మాత్రం ఒక్క హిట్‌నూ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. హీరోగా చేసిన మూడు చిత్రాలు నిరాశ పరిచాయి. ఆకట్టుకునే అందం.. ఫిజిక్.. నటన ఉన్నా.. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అతడు చేసిన మూడు ప్రయత్నాలూ విఫలం అయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఈ సారి చేయబోయే సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇందులో భాగంగానే అఖిల్.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సంతకం పెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ, అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రలో ఓ ప్రముఖ దర్శకుడు నటించబోతున్నారట. ఆయనే సీనియర్ డైరెక్టర్, యాక్టర్ సముద్రఖని. అవును.. సముద్రఖని ఈ సినిమాలో నటించబోతున్నారట. ఇప్పటికే ఆయనతో చిత్ర బృందం మంతనాలు కూడా జరిపిందని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలుగులో నాలో, శంభో శివ శంబో, జెండాపై కపిరాజు సినిమాలను డైరెక్ట్ చేసిన ఈయన ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు. అలాగే తెలుగు సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'RRR'లో కూడా నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచారు. కానీ, 'RRR'లో సముద్రఖని.. ఎన్టీఆర్‌కు బాబాయిగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.