Spirit: ప్రభాస్ కోసం పాన్ ఇండియా హీరోయిన్స్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ డబుల్ రొమాన్స్?

పాన్ ఇండియా సినిమాలతో దేశంలోనే అతి పెద్ద స్టార్ హీరోగా గుర్తింపు అందుకుంటున్న ప్రభాస్ తదుపరి సినిమాలతో కూడా మంచి విజయాలను సొంతం చేసుకోవాలని ప్రణాళికల రచిస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో అయితే చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. యువ దర్శకులు సీనియర్ దర్శకులు ప్రభాస్ కోసం ప్రత్యేకంగా బిగ్ బడ్జెట్ సినిమాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ ఊహించని డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతకు ముందు వచ్చిన సాహో సినిమా పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా పూర్తి స్థాయిలో నిరాశపరిచింది. కమర్షియల్గా కూడా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

దాదాపు 90 కోట్ల వరకు రాధే శ్యామ్ నష్టాలను కలిగించినట్లు సమాచారం. అయితే తదుపరి సినిమాలతో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి అని ప్రభాస్ చర్చలు జరుపుతున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Director sandeep reddy discussion on two star heroines for prabhas spirit,

అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్టు K కూడా ప్రభాస్ లిస్టులో ఉన్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ అనుకుంటున్నారు.

ఇంకా ఈ సినిమా అయితే మొదలవలేదు. కానీ దర్శకుడు అయితే పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ లో ఎనిమల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్టు కొనసాగిస్తూనే మధ్యమధ్యలో ప్రభాస్ సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు లో దర్శకుడు ఇద్దరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రభాస్ తో ఇప్పటి వరకు నటించన అగ్రహీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకోవాలని నిర్మాతలతో కూడా మాట్లాడినట్లు సమాచారం

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే మెయిన్ హీరోయిన్ గా గ్లామరస్ బ్యూటీ కీయరా అద్వానీని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ రామ్ చరణ్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరొకవైపు పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సినిమా కథకు తగ్గట్టుగా ఇద్దరు హీరోయిన్స్ ఉంటేనే బాగుంటుంది అని ఇద్దరి పేర్లను ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X