Animal Movie: షాలిని, రష్మిక.. ఇద్దరికి ఒకే మాట చెప్పి బుట్టలో పడేసిన సందీప్ రెడ్డి వంగా!

సందీప్ రెడ్డి వంగా... సినిమా ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్. ఆయన ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ను ఊపేసాడు. అదే సినిమాను బాలీవుడ్లో తీసి... అక్కడ తానేంటో నిరూపించుకున్నాడు. ఇక ఆయన తీయబోయే నెక్ట్స్ మూవీ.. ఇండియానే కాదు.. వరల్డ్ నే షేక్ చేసేలా ఉందని ఇప్పటికే అభిమానులు అంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి.. యానిమల్ సినిమాల్లో మెయిన్ గా ఫీమేల్ రోల్ చేసిన షాలినీ, రష్మికకు ఒకే ఒక్క మాట చెప్పి.. తన బుట్టలో వేసుకున్నట్లు నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు ఏం చెప్పారు.. వాళ్లు దేనికి ఒప్పుకున్నారు అనే విషయంపై ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో అప్పటి వరకు సినిమాలు అంటే.. యాక్షన్, లవ్ ఎంటర్ టైనర్స్.. ఎప్పుడైతే సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడో.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. అయినా దర్శకుడిపై నమ్మకంతో నిర్మతాలు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువచ్చారు. ఇక ఆ నమ్మకాన్ని సందీప్ రెడ్డి వంగా వొమ్ము చేయలేదు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్టును కొట్టాడు.

Director Sandeep Reddy Vanga convinced heroines Shalini Pandey and Rashmika Mandanna to act in lip lock scenes.

ఇక అదే స్టోరీతో హిందీలోకి వెళ్లాడు సందీప్ వంగా. అక్కడ కబీర్ సింగ్ అని షాహిద్ కపూర్ తో సినిమా తీశాడు. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా మారింది. ఇప్పుడు రణబీర్ కపూర్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా యానిమల్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు సందీప్. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రష్మిక మందన్నా లిప్ లాక్స్ విషయమే బయట అంతా మాట్లాడుకుంటున్నారు.

అయితే అర్జున్ రెడ్డి సినిమాలో కూడా విజయ్ దేవరకొండ, షాలినీ పాండేల మధ్య రొమాంటిక్ సీన్స్ హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా లిప్ లాక్ సీన్స్ అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. అయితే హీరోయిన్ గా షాలినీ పాండే అంత డేర్ చేయడానికి ఒకటే కారణం అని తెలుస్తోంది. ఇటు యానిమల్ మూవీలో రష్మిక లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి కూడా ఒకటే కారణం అని తెలుస్తోంది. ఇద్దరినీ డైరెక్టర్ ఎలా ఒప్పించాడు అని నెట్టింట్లో వైరల్ గా మారింది.

Director Sandeep Reddy Vanga convinced heroines Shalini Pandey and Rashmika Mandanna to act in lip lock scenes.

అయితే మరో విషయం ఏంటంటే షాలినీ పాండే, రష్మిక మందన్నాలకు సందీప్ వంగా... ఒకే ఒక్క మాట చెప్పారట. ఇది కేవలం సినిమా... ఈ పాత్రలో మీరు నటిస్తున్నారు.. మీరు నటిగా మీ పాత్రకు న్యాయం చేస్తారు అంతే.. అంటూ లిప్ లాక్ సీన్స్ కు వీరిద్దరిని ఒకే మాట చెప్పి సందీప్ ఒప్పించనట్లు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఏది ఏమైనా సందీప్ రెడ్డి చాలా తెలివిగా వీరిని ఒప్పించారని... మొత్తానికి తన బుట్టలో వేసుకున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Director Sandeep Reddy Vanga convinced heroines Shalini Pandey and Rashmika Mandanna to act in lip lock scenes.

ఇక యానిమల్ సినిమా తండ్రీకొడుకుల డ్రామాతో రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. మ‌రో సీనియ‌ర్ హీరో బాబీ డియోల్ విల‌న్‌గా న‌టిస్తున్నారని తెలుస్తోంది. యానిమ‌ల్ మూవీ హిందీ, తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో డిసెంబ‌ర్ 1న విడుదల కానుంది. టీ సిరీస్ సంస్థ‌తో క‌లిసి సందీప్ వంగా యానిమ‌ల్ మూవీని నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X