Spirit: ప్రభాస్ స్పిరిట్‌లో మరో ఇద్దర స్టార్ హీరోస్.. అదిరిపోయేలా సందీప్ రెడ్డి ప్లాన్!

Spirit movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు.. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజీ షూటింగ్ కి కూడా రెడీ అయ్యాడు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్‌ ఈ రెండు సినిమాలతో పాటు సన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్న భారీ యాక్షన్ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజక్ట్స్ లో స్పిరిట్ ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఈ న్యూస్ ఏంటో మీరూ కూడా ఓ లూక్కేయండి.

ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజక్ట్స్ లో స్పిరిట్. ఈ మూవీకి సన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన డైరెక్షన్ చేసే మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన డైరెక్టర్ చేసిన మూవీ అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, ఆనిమల్ సినిమాలు చూస్తే.. ఆయన రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండను స్టార్ గా మార్చివేశాడు. కబీర్ సింగ్ తో షాహిద్ కు, ఆనిమల్ సినిమాతో రణ్ బీర్ కపూర్ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చారు. అలాగే.. ఆయన చేసే ఏ మూవీ అయినా.. బాక్సాఫీస్ వద్ద బారీ కలెక్షన్ల వసూళు చేయాల్సిందే.

Director Sandeep Reddy Vanga is planning to give the guest roles to Vijay Devarakonda Ranbir Kapoor in Prabhas Spirit movie

ప్రస్తుతం యంగ్ రెంజ్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీని ప్లాన్ చేశారు. దాదాపు ఏడాది కిత్రమే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అన్సౌస్ మెంట్ జరిగింది. ప్రభాస్ - సందీప్ రెడ్డి కాంబోలో రావడంతో స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా గురించి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. రోజురోజుకు సినిమాపై హైప్ పెంచుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ వార్త ఫిల్మ్ సర్కిల్ లో తెగవైరల్ అవుతోంది. ఈ ప్రచారం ప్రకారం ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో మరో ఇద్దరు స్టార్ హీరోస్ ‌ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నటింపజేస్తున్నారట.

ఇంతకీ ఆ స్టార్ హీరోస్ ఎవరో కాదు.. అర్జున్‌ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, యానిమల్‌ హీరో రణబీర్ కపూర్‌. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ లతో' స్పిరిట్ ' మూవీలో కామియో రోల్స్ ( అతిథి పాత్ర)లో నటింప జేయాలని భావిస్తున్నారట. మరో స్టార్ హీరోను విలన్ రోల్ వేయించాలని భావిస్తున్నారట.

ఇక.. రణబీర్, విజయ్ దేవరకొండలతో సందీప్ రెడ్డి కి ఉన్న అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సందీప్ దర్శకత్వంలో వచ్చిన యానిమల్,అర్జున్ రెడ్డి మూవీ ఈ హీరో కెరీర్స్ లోనే మైల్ స్టోన్స్. డైరెక్టర్ సందీప్ అడిగితే వీరిద్దరూ కచ్చితంగా ఓకే అనేస్తారు. చిన్న పాత్రలో కనిపించిన పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు భారీ హైప్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ హీరోస్ ఓకే అంటే..వీరు ఎలాంటి రోల్స్ నటించబోతున్నారనే ఆసక్తికరంగా మారింది. ఇదెలా ఉంటే..సందీప్ అయితే మాత్రం స్పిరిట్ కి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నాడు.

Director Sandeep Reddy Vanga is planning to give the guest roles to Vijay Devarakonda Ranbir Kapoor in Prabhas Spirit movie

ఇదెలా ఉంటే.. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్ ను డ్యుయెల్‌ రోల్‌ లో నటించబోతున్నారట. అందులో ఒక రోల్ మాత్రం రీలివ్ అయింది. పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించబోతున్నారు. అయితే.. లవ్ , ఎమోషనల్, రొమాంటిక్ సీన్స్‌ ను ప్రభాస్‌తో ఎలా చేస్తారు అనేది ఆసక్తి గా మారింది. ఇలా ఎప్పటికప్పుడు క్రేజీ న్యూస్ తో స్పిరిట్ పై అంచనాలు పెంచుతున్నారు మూవీ మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X