Ram Charan తో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. RRR కంటే హై రేంజ్ లోనే స్టార్ డైరెక్ట్ ప్లాన్?

RRR సినిమా సక్సెస్ కావడంతో మరి కొంతమంది అగ్ర దర్శకులు కూడా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటేనే కాస్త ఆలోచించే హీరోలు ఇప్పుడు అలాంటి ప్రాజెక్టులు వస్తే ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. నిర్మాతలు కూడా మంచి కంటెంట్ దొరికితే భారీ స్థాయిలో ఖర్చుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తో మరొక అగ్ర దర్శకుడు కూడా అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

RRR అనంతరం

RRR అనంతరం

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన RRR సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ ఇద్దరు కూడా ఫ్యాన్ ఇండియా మార్కెట్లో వారికంటూ ఒక స్టార్ ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నారు. అయితే ఇదే తరహాలో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టులుగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 రామ్ చరణ్ తోనే..

రామ్ చరణ్ తోనే..

ముఖ్యంగా రామ్ చరణ్ తోనే ఒక అగ్ర దర్శకుడు మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించాలి అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ తన 15వ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను దిల్ రాజు 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా అనంతరం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు.

1000 కోట్ల ప్రాజెక్ట్?

1000 కోట్ల ప్రాజెక్ట్?

అయితే రామ్ చరణ్ గౌతమ్ తిన్నానూరి సినిమా తర్వాత ఎవరితో చేస్తాడు అనే విషయంలో అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ లిస్టులో అయితే బడా దర్శకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల మరొక తమిళ్ దర్శకుడు కూడా ఆయనతో కొత్త ప్రాజెక్టుపై చర్చలు జరిపైనట్లు సమాచారం. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందే కథ గురించి చెప్పినట్లు టాక్.

ఆ దర్శకుడు ఎవరంటే..

ఆ దర్శకుడు ఎవరంటే..

ఆ దర్శకుడు మరెవరో కాదు. ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాను డైరెక్టర్ చేస్తున్న శంకర్ తెలుస్తోంది. శంకర్ రామ్ చరణ్ 15 సినిమా తర్వాత మరొక రెండు ప్రాజెక్టులను పూర్తి చేయనున్నాడు. మధ్యలో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమాతోపాటు హిందీలో రణవీర్ సింగ్ తో మరొక సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ ప్రాజెక్టులను అనంతరం ఆయన RRR కంటే హై రేంజ్ లో మరొక మల్టీస్టారర్ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడట.

మరో హీరో ఎవరు?

మరో హీరో ఎవరు?

దర్శకుడు శంకర్ సిద్ధం చేసుకున్న కథ ప్రకారం అయితే ఆ ప్రాజెక్టుకు దాదాపు 1000 కోట్లు ఖర్చు అవుతుందట. అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండే ఆ కాన్సెప్ట్ లో ఇద్దరు హీరోలు అవసరం కానున్నారట. ఇక రామ్ చరణ్ తో పాటు మరొక బాలీవుడ్ హీరోని కూడా అనుకుంటున్నారు. అందులో ఎక్కువగా హృతిక్ రోషన్ పేరు వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X