ఇండియన్ 2 వివాదం: మ్యాటర్‌ను క్లోజ్ చేసేందుకు శంకర్ ప్రయత్నం.. ఏం చేయబోతున్నారంటే?

ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా ఎంతగానో గుర్తింపు అందుకున్న శంకర్ ఇటీవల కోర్టు నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్ లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో విషయం సీరియస్ గా మారింది. ఇక నిర్మాణ సంస్థ కోర్టు వరకు వెళ్లడంతో మ్యాటర్ ను వీలైనంత త్వరగా క్లోజ్ చేయాలని శంకర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
బడ్జెట్ లిమిట్స్ ఎంత దాటినా..

బడ్జెట్ లిమిట్స్ ఎంత దాటినా..

శంకర్ వీలైనంత వరకు వివాదాలకు దూరంగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. సినిమాపై బడ్జెట్ లిమిట్స్ ఎంత దాటినా కూడా మళ్ళీ తిరిగి వస్తుందని నమ్మకం ఉంటేనే సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఏదైనా సరే పక్కా ప్లానింగ్ తో వర్క్ చేసే శంకర్ ఇండియన్ 2 విషయంలో మాత్రం అనుకోని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కండిషన్స్ పెట్టడంతో..

కండిషన్స్ పెట్టడంతో..

ఇండియన్ 2సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతోంది. సినిమాను మొదట దిల్ రాజు ప్రొడక్షన్ లో స్టార్ట్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత అనుకోకుండా లైకా ప్రొడక్షన్ వద్దకు వెళ్లింది. అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటే బడ్జెట్ విషయంలో శంకర్ కు కండిషన్స్ చాలానే పెట్టారని టాక్ వచ్చింది.

చరణ్ తో కొత్త సినిమా

చరణ్ తో కొత్త సినిమా

కమల్ హాసన్ మధ్యలో ఆలస్యం చేయడం, అలాగే షూటింగ్ యాక్సిడెంట్ లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, కోవిడ్ ఎఫెక్ట్.. ఇలా ఎదో ఒక ఘటనతో సినిమాకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇక లాక్ డౌన్ అనంతరం నిర్మాతల నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ రాకపోవడంతో అప్సెట్ అయిన శంకర్ రామ్ చరణ్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఇక శంకర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన లైకా ప్రొడక్షన్ కోర్టుకు వెళ్లడంతో ఇప్పుడు దర్శకుడు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ముందు ఇండియన్ 2ని పూర్తి చేసి

ముందు ఇండియన్ 2ని పూర్తి చేసి

ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ముందు ఇండియన్ 2సినిమాను పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ తరువాతే రామ్ చరణ్ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. కాకపోతే సినిమా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో రామ్ చరణ్ కొత్త సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X