ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ ఐతే రికార్డులు కాదు ప్రభంజనమే..!?
'రోబో" సినిమాలో హీరోయిన్ పాత్రకి ఐష్ తప్ప ఇంకెవరూ తన ఊహల్లోకి రాలేదంటున్నాడు దర్శకుడు శంకర్. ఐశ్వర్య రాయ్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమనీ, ఆ అభిమానంతోనే 'జీన్స్" సినిమాలో ఆమెను తీసుకున్నాననీ, ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఐష్ ని సంప్రదించినా, అప్పుడు వేరే సబ్జెక్ట్ తో బిజీగా వున్న ఐష్, తన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించిందని శంకర్ చెప్పుకొచ్చాడు.
ఐష్ గొప్ప నటి అనీ, అంతకన్నా గొప్ప డాన్సర్ అనీ కితాబులిచ్చిన శంకర్, తన తదుపరి చిత్రంలోనూ ఐష్ నే హీరోయిన్ గా పెడ్తానని అంటున్నాడు. రజనీతోనే మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నానన్న శంకర్, ఈసారి తెరకెక్కించబోయే సినిమా మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. రోబో తో తమ కాంబినేషన్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయనీ, ఆ అంచనాల్ని అందుకునేందుకు కథను చాలా పక్కాగా రూపొందించాల్సి వుంటుందని అన్నాడు శంకర్.
రజీనీకాంత్ ఐశ్వర్య రాయ్ శంకర్ రోబో ఎర్ రెహమాన్ కళానిధి మారన్ జీన్స్ rajinikanth aishwarya rai shankar robo ar rahman kalanidhi maran jeans


Click it and Unblock the Notifications