మహేష్ బాబు కన్నా'రోబో' డైరెక్టర్ కే ఎక్కువంటా...!?
మాములుగా దర్శకులకన్నా హీరోలే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. రికార్డు తిరగ రాసే సినిమాలిచ్చిన దర్శకుడు శంకర్ ఈ విషయాన్ని కూడా తిరగరాసాడు. మహేష్ బాబు హీరోగా అతను తెలుగు, తమిళ భాషల్లో 'త్రీ ఇడియట్స్" రీమేక్ కు దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇందుకుగానూ శంకర్ 12 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాడట. మహేష్ బాబు పారితోషికం కన్నా ఇది ఎక్కువ. 'రోబో" విజయం తర్వాత శంకర్ అమాంతంగా తన పారితోషికాన్ని పెంచేసాడు. నిర్మాతలు కూడా అతనికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.


Click it and Unblock the Notifications











